Miss World 2025 | హైదరాబాద్ లో జరుగనున్న మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణులు ఒక్కక్కరుగా వస్తున్నారు.. ఈ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టర్లు ఈనెల 6 వ తేదీ నుంచి హైదరాబాద్ (Hyderabad)కు చేరుకుంటారు.మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో (Ms.Jessica Scandiuzzi Pedroso (Brazil) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఆదివారం ఉదయం చేరుకున్నారు. శంషాబాద్ కు చేరుకున్న మిస్ బ్రెజిల్ కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ లు ఇప్పటికే చేరుకున్నారు.

ఇదిలా ఉండగా మిస్- వరల్డ్ (Miss World 2025) పోటీల్లో పాల్గొనేందుకు మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ ( Ms. Emma Deanna Cathryn Morrison,) నిన్ననే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా ఆమెకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    