Sarkar Live

MLA Disqualification Case | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

MLA Disqualification Case : బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ (Supreme Court Verdic) జరిగింది. ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్

MLA Disqualification Case

MLA Disqualification Case : బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ (Supreme Court Verdic) జరిగింది. ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

కాంగ్రెస్‌లో చేరడం రాజ్యాంగ విరుద్ధం : పిటిష‌న‌ర్లు

ఈ కేసులో అసెంబ్లీ సెక్రటరీ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు ప్రస్తావించారు. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ పదవులను వదిలిపెట్టకుండా కాంగ్రెస్ (Congress)లో చేరడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ (BRS) చెందిన పిటిషనర్లు పేర్కొన్నారు. వారు రాజీనామా చేయకుండా పార్టీ మారడం ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే చర్య అని ఆర్యమా సుందరం కోర్టుకు వివరించారు.

MLA Disqualification Case : రాజకీయ దృష్ట్యా కీలక కేసు

ఈ కేసు తెలంగాణ రాజకీయాల (Telangana Politics)కు అత్యంత ప్రాధాన్యం కలిగినదిగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమంది ఆ పార్టీలోకి చేరారు. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ కేసును విచారించినప్పటికీ తుది తీర్పు ఇంకా రాలేదు. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడంతో తుది తీర్పు తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేలా మారనుంది. స్పీకర్ తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారన్నదానిపై పలు ఊహాగానాలు నడుస్తుండగా సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన తర్వాతే మిగతా పరిణామాలు స్పష్టత కలిగే అవకాశం ఉంది.

ఎమ్మెల్యే అనర్హతపై పిటిషన్లు.. కోర్టు తీర్పు ప్రభావం

MLA Disqualification Case : తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయింపులు (Party Defection), ఎమ్మెల్యేల అనర్హత (Disqualification) వంటి అంశాలపై ఇప్పటికే పలుమార్లు కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ ఈ కేసు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సుప్రీంకోర్టు తీర్పు బట్టి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చు. అనర్హత వేటుపై కోర్టు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి మార్పులను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందే అవకాశం ఉంది. మరోవైపు స్పీక‌ర్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోర్టు భావిస్తే స్పీకర్ నిర్ణయం వచ్చేంత వరకు అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేల హోదా మారదు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?