Hyderabad : స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి సమావేశాలకు హాజరవుతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పష్టం చేశారు. ‘ఒకప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా పార్టీ అగ్ర నాయకత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండేది. బీజేపీ సభలో మాట్లాడే అవకాశమే ఇచ్చేది కాదని ఆయన తెలిపారు.. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఎక్కువ. నాలాగే చాలా మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహరమే’ అని తెలిపారు. కాగా ఇటీవలే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) పార్టీ అగ్ర నాయకత్వానికి ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపిన విషయంపై రెండురోజుల క్రితం రాజా సింగ్ స్పందించారు. భారీ మెజారిటీతో గెలిచిన ఒక ఎంపీ ఎంతగా మనస్తాపానికి గురైతే అలాంటి పని చేస్తారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదే తరహాలో ఫుట్‌బాల్ గిఫ్ట్‌లు ఇవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్లమెంటులో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా సొంత పార్టీ వారే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    