Sarkar Live

TGBKS | ఎమ్మెల్సీ కవితకు షాక్‌..! బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఉద్వాసన.. ?

TGBKS | తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS) నుంచి MLC కవితకు ఉద్వాసన పలికారు. ఇప్పటివరకు ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. తెలంగాణ భవన్‌లో సమావేశమైన

TGBKS

TGBKS | తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS) నుంచి MLC కవితకు ఉద్వాసన పలికారు. ఇప్పటివరకు ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. తెలంగాణ భవన్‌లో సమావేశమైన సంఘం నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై TGBKS.. బీఆర్ఎస్‌కు అనుబంధంగా పనిచేయాలని నిర్ణయించారు. కవిత, KTRల మధ్య విభేదాలు పెరుగుతున్న తరుణంలో KTR కొప్పుల ఈశ్వర్‌ను నియమించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం బుధ‌వారం సాయంత్రం జ‌రిగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాల‌ని కేటీఆర్ సూచించారు. కాగా ఈ సమావేశంలోనే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కోసం పార్టీ తరఫున ఇంచార్జిగా ఇకపై బొగ్గు గని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారు. కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం తీసుకున్నారు. .

సింగరేణి సమస్యలపై మరింత పెద్దఎత్తున పోరాటం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు అనేక ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ సూచించారు. పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి సంస్థ కోసం చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకుపోవాలన్న కేటీఆర్ సూచ‌న‌లు చేశారు. .

పది సంవత్సరాల కాలంలో సింగరేణి తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ పనిచేశారు. కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలను బిఆర్ ఎస్ తీవ్రంగా వ్య‌తిరేకించిన విష‌యాన్ని కేటీఆర్ ఈసంద‌ర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అడ్డగోలుగా అమలు చేయడానికి వీలుకాని హామీలు ఇచ్చిన తీరుగానే సింగరేణికి కూడా మోసం చేసిందని, ఈ అంశాలను కార్మికుల దృష్టికి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణ కోసం బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై గళమెత్తలన్నారు. బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు సహకారం అందిస్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు.

కార్మికుల కోసం పార్టీ లీగల్ సెల్ కూడా పూర్తిస్థాయి అండగా ఉంటుంది… ఏ కార్మికునికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసినా… చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ సెల్‌ సహకారం అందిస్తుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?