Mohan Babu : ఓ జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో తనపై దర్యాప్తు జరుగుతోందని వస్తున్న వార్తలను ఖండించిన మోహన్‌బాబు తాజాగా మరోసారి తన X ఖాతాలో మరో ట్వీట్ చేశారు. హై కోర్టు తన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, తన ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నానని తెలిపారు. తనపై లేనిపోని దుష్ప్రచార జరుగుతోందని, దయజేసి మీడియా దీన్ని మానుకోవాలని కోరారు.
తీవ్రంగా స్పందించిన మోహన్ బాబు
తన ఇంటి వద్ద జరిగిన వివాదాన్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టుపై మోహన్‌బాబు (Manchu Mohan babu) దాడి చేశారని ఆయపై పోలీసు కేసు నమోదైంది. తన కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్యతో మోహన్‌బాబుకు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద గొడవ జరగ్గా దాన్ని కవర్ చేయడాని మీడియా అక్కడికి వెళ్లింది. మీడియాతో మాట్లాడుతున్న క్రమంలోనే మోహన్‌బాబు కోపోద్రిక్తులై ఓ జర్నలిస్టుపై దాడి చేశారని ఆయనపై ఆరోపణ. దీంతో డిసెంబర్ 13న మోహన్‌బాబుపై పహాడి షరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తనపై పోలీసులు మరింత చర్యలు తీసుకోకుండా ఆయన రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే.. ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందని, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందని మీడియాలో వస్తున్న కథనాలపై మోహన్‌బాబు తీవ్రంగా స్పందించారు.
కుప్పలు తెప్పలుగా కథనాలు
మోహన్‌బాబుతో ఆయన కుమారుడు మనోజ్(Manchu Manoj), అతడి భార్యతో ఉన్న వివాదం నేపథ్యంలో గొడవ జరగుతుండగా మీడియా అక్కడికి చేరింది. దీన్ని కవర్ చేస్తుండగా మీడియాపై మోహన్‌బాబు విరుచుకుపడ్డారు. ఇదే క్రమంలో ఆయన ఆగ్రహానికి గురై వీరంగం సృష్టించారు. ఆ సమయంలో తనపై ఆయన దాడి చేశారని ఓ జర్నలిస్టు పహాడి షరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన మైక్‌ను లాక్కున్న మోహన్‌బాబు దుర్భాష మాట్లాడుతూ దాడి చేశారని ఆ జర్నలిస్టు ఆరోపించాడు. మైక్ పైప్‌కు మెటల్ లోగో ఉండటంతో తన తలకు తీవ్ర గాయమైందని పేర్కొన్నాడు. మోహన్‌బాబు తీరుపై టీవీ చానల్స్ ప్రసారం చేశాయి. ప్రింట్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. తనపై వస్తున్న ఆరోపణలపై మోహన్‌బాబు స్పందిస్తూ ఓ ఆడియాను విడుదల చేశారు. జర్నలిస్టుకు హానికలిగించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
X వేదికగా ఖండన
తన వివాదంపై మీడియాలో జోరుగా కథనాలు రావడం, జర్నలిస్టుపై దాడి విషయం మరింత చర్చనీయాంశం కావడంతో మోహన్‌బాబు పలుమార్లు ఆయా మాధ్యమాల ద్వారా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన అజ్ఞాతంలో ఉన్నారని, ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అది తిరస్కరణకు గురైందనే వార్తలు కూడా మీడియాలో జోరందుకున్నాయి. దీనిపై తాజాగా మోహన్‌బాబు తన ఖాతాలో X ట్వీట్ చేస్తూ దీన్ని ఖండించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..