Vijay Deverakonda | విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించలేదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన కింగ్ డమ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం…..
స్టోరీ…
సూరి, శివ (విజయ్ దేవరకొండ, సత్య) ఇద్దరు అన్నదమ్ములు. ఒకరికి ఒకరు ప్రాణంగా పెరుగుతుంటారు. వీళ్ల ఇంట్లో రోజు గొడవలే జరుగుతుంటాయి. ఒక సిట్యువేషన్ లో వీళ్ల నాన్న ని శివ చంపి పారిపోతాడు.పెద్దయ్యాక సూరి పోలీసు అవుతాడు. శివ స్మగ్లింగ్ గ్యాంగ్ కి లీడర్ అవుతాడు. ఒక రిస్కీ ఆపరేషన్ లో భాగంగా సూరి స్పై గా మారి వాళ్ళ అన్న దగ్గరికి చేరుతాడు. అక్కడికి వెళ్ళాకా ఏమైంది..? శివను అక్కడి నుండి తీసుకొచ్చాడా..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే..
Vijay Devarakonda : మూవీ ఎలా ఉందంటే…
విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. మూవీలో విజయ్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే సీన్స్ సాగదీసినట్టుగా కాకుండా పర్ఫెక్ట్ గా ఉన్నాయనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టని విధంగా తీశారు. పోలీస్ కానిస్టేబుల్ గెటప్ లో తన లుక్ అదిరిపోయింది. 18 సంవత్సరాలుగా తన అన్న కోసం వెతుకుతున్న సూరికి తానున్న చోటు తెలిసే ఫోటో సీన్లో విజయ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ కదిలిస్తుంది. హీరో స్పై గా మారాక వచ్చే సీన్స్ కూడా అదిరిపోతాయి. జైల్లో వచ్చే సీన్స్ అయినా, సత్య విజయ్ కాంబోలో వచ్చిన ఎమోషనల్ సీన్స్ వర్కవుట్ అయ్యాయి.ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు.అక్కడక్కడ ఆడియన్స్ విజిల్స్ వేసే సీన్స్ తీయడం మూవీకి ప్లస్ గా మారుతుందని చెప్పొచ్చు.ఇక సెకండాఫ్ లో డైరెక్టర్ కథపై పట్టు కోల్పోయాడనిపించింది. లాజిక్ లేని సీన్స్ తో లాక్కొచ్చాడు.విజయ్ దేవరకొండ ఎందుకోసం స్పై గా మారి వెళ్ళాడో ఆ విషయమే పక్కదారి పడుతోందా అనే ఆలోచనలు ఆడియన్స్ కి కలుగుతుంది. సెకండాఫ్ పై మరింత దృష్టి పెడితే బాగుండేదనిపించింది. క్లైమాక్స్ అంత బలంగా అనిపించదు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
గౌతమ్ తిన్ననూరి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ ని ఎంచుకుని కొంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అన్న తమ్ముడు మధ్య ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించి పర్వాలేదని అనిపించుకున్నాడు. హీరో విజయ్ దేవరకొండ కు ఈ మూవీ పెద్ద ఊరట అని చెప్పొచ్చు. వరుస ఫ్లాప్ ల తరవాత ఇలాంటి మూవీ పడడం అందులో విజయ్ నటుడిగా మరో మెట్టు ఎక్కాడనిపించింది. తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఇక హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సె కి ఈ మూవీలో యాక్టింగ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. తన పరిధి మేరకు పర్వాలేదని అనిపించింది. సత్య యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొనక్కర్లేదు. ఎప్పటి లాగే టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపాడు. తన పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. విలన్ రోల్ లో వెంకటీష్ సూపర్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు. కోలీవుడ్ సంచలనం అనిరుద్ మ్యూజిక్ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ బీజీఎంతో బాగా ఎలివేట్ అయ్యాయి. పాటలు అంతగా లేకున్న బిజీ ఎం తో దుమ్ము దులిపాడు. ఎమోషనల్ సీన్స్ లో వచ్చే బిజీఎం బాగుంటుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ తో అదరగొట్టిన కింగ్ డమ్ సెకండాఫ్ అంతలా మెప్పించలేకపోయింది.
ప్లస్ పాయింట్స్..
- విజయ్ దేవరకొండ,
- సత్య యాక్టింగ్
- ఫస్ట్ ఆఫ్
- అనిరుధ్ బీజీఎం
మైనస్ పాయింట్స్…
- సెకండాఫ్ లో లాజిక్ లేని సీన్స్
- పాటలు
రేటింగ్
3.5/5
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.