- ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న హరీష్
- ఆత్మహత్య పై పలు అనుమానాలు
Telangana | ములుగు జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు ఆ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు సోమవారం ఉదయం ఓ ఎస్సై (SI) ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో జిల్లాలో అసలు ఏంజరుగుతోంది అని సామాన్యులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళితే ములుగు జిల్లా వాజేడు SI హరీష్ కాసేపటి క్రితమే తన రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ములుగు (Mulugu) జిల్లాలో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే అయితే ఎన్కౌంటర్ జరిగిన మరునాడే ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .ఎస్సై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఎస్సై ఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది.
One thought on “Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య”