గొడ్డలితో నరికి చంపిన దుండగులు
Mahaboobabad | మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య (Murder) కలకలం రేపింది. పార్థసారథి (42 ) అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు.. రోడ్డు పక్కన ఉన్న మిరప తోటలోకి తీసుకెళ్లిన దుండగులు అతడిన అతికిరాతకంగా నరికి చంపారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుకున్నారు.. ఈ హత్య మహబూబాబాద్ మండలం భజనతండా శివారులో జరిగింది.. బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పార్థసారధిని గుర్తుతెలియని దుండగులు కాపు కాసి పక్కనే ఉన్న మిర్చి తోటలోకి తీసుకువెళ్లారు..
మృతుడు పార్థసారథి (Parthasarathi) స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam). కాగా ఆయన ప్రస్తుతం మానుకోట జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ (health supervisor) గా పనిచేస్తున్నారు.. బైక్ పై వెళ్తున్న అతడిని పక్కా ప్లాన్ ప్రకారమే పథకం ప్రకారం అడ్డగించిన గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్థసారథి దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్ పనిచేస్తున్నాడు. మంగళవారం ఇంటి నుంచి దంతాలపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు రోజువారీ విధుల కోసం వెళ్తుండగా.. అనుకోని రీతిలో హత్య (Murder in Manukota)కు గురయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ తో విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








