Madarasi movie | మురుగదాస్ (Muruga Das ) సినిమా అంటే ఒకప్పుడు సెన్సేషన్. తన నుండి మూవీ వస్తుందంటే సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యేవి. విజయ్ కాంత్ (Vijay kanth) తో రమణ మూవీ తీసి భారీ హిట్టు కొట్టాడు. అదే మూవీని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశాడు. ఒక కొత్త డైరెక్టర్ మూవీని చిరు లాంటి బిగ్ స్టార్ రీమేక్ చేశాడంటేనే అర్థమవుతుంది తను ఏ రేంజ్ లో స్టోరీ రాశాడో. తెలుగులో వీవీ వినాయక్ తెరకెక్కించగా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
ఇక గజినీ మూవీని సూర్యతో హిందీ లో అమీర్ ఖాన్ తో తీసి సెన్సేషనల్ హిట్స్ అందుకున్నాడు. మురుగదాస్ పేరు మారుమోగింది. ఇదే ఊపును కొనసాగిస్తూ విజయ్ తో కత్తి, తుపాకి మూవీలను తీసాడు. అవి కూడా మురుగదాస్ రేంజ్ ను అమాంతం పెంచాయి. చిరు పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పి సినీ రీ ఎంట్రీ లో కూడా మురుగదాస్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు.
స్టార్స్ అందరూ ఆయనతో ఒక్క మూవీ అయినా చేయాలని ఎదురుచూసేవారు. ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్ లలో మురుగదాస్ కూడా ఒకడని పేరు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ తో స్టాలిన్ తీసి భారీ హిట్టు ఇవ్వకున్నా ఆ మూవీ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. మహేష్ బాబు తో తీసిన స్పైడర్ పై ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయారు.
వరుస ఫ్లాప్ లతో సతమతం…
విజయ్ కి రెండు హిట్టు సినిమాలు ఇచ్చి మూడో సినిమాగా సర్కార్ కూడా ఆ రేంజ్ హిట్టు గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్ తీసినా హిట్టు కొట్టలేకపోయాడు. ఈ రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ కాదు కానీ వారి రేంజ్ కి తగ్గ మూవీస్ కాదు. సల్మాన్ ఖాన్ తో తీసిన రీసెంట్ మూవీ సికిందర్ తో అయినా హిట్టు బాట పడుతాడనుకున్న మురుగదాస్ ఆ మూవీ కూడా డిజప్పాయింట్ చేసింది.
Madarasi movie : కం బ్యాక్ సినిమా అవుతుందా..?
ఒకప్పుడు టాప్ డైరెక్టర్ ఇప్పుడు ఫ్లాప్ లు తీస్తుండడంతో మురుగదాస్ ఫ్యాన్స్ హిట్టు కొట్టాలని కోరుకుంటున్నారు. ప్రజెంట్ శివకార్తికేయన్ (Siva Karthikeyan)తో మదరాసి (Madarasi ) మూవీ తీస్తున్నారు. దీనిపైనే మురుగదాస్ కూడా ఆశలు పెట్టుకున్నారు. మూవీ త్వరలోనే రిలీజ్ కానుండగా మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ వర్క్ స్టార్ట్ చేశారు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ మూవీతోనైనా మురుగదాస్ కం బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








