అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) డిఫరెంట్ క్యారెక్టర్ లను ఎంచుకుంటూ తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. మొదటి నుంచి కూడా వైవిధ్యమైన స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు. మొదట్లో లవ్ స్టోరీస్ చేసినా తర్వాత యాక్షన్ మూవీస్ కూడా చేసి ఆడియన్స్ ని మెప్పించాడు. టైర్ 2 హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకొని కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు.
రీసెంట్ గా తను హీరోగా చందు మొండేటి(Chandu mondeti) డైరెక్షన్లో వచ్చిన తండెల్ మూవీ ఎంత భారీ హిట్టు కొట్టిందో మనకు తెలిసిందే. నాగచైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా కూడా నిలిచిపోయింది.తన కెరీర్లో మొదటిసారి 100 కోట్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచింది. ఆ మూవీ తర్వాత నాగచైతన్య ఎవరి డైరెక్షన్లో మూవీ చేస్తాడా అని తన ఫ్యాన్స్ ఎదురుచూశారు.
Naga Chaitanya మైథాలజికల్ మూవీ..
విరుపాక్ష (veerupaksha)మూవీతో డిఫరెంట్ టేకింగ్ తో ఆకట్టుకున్న కార్తీక్ దండు(Karthik dandu) డైరెక్షన్లో నాగచైతన్య తదుపరి మూవీ తెరకెక్కుతుందని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించి హీరో మేకోవర్ కి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో ఎన్ సీ 24 మూవీ గా హై ఎక్స్పెక్టేషన్స్ తో మైథలాజికల్ మూవీగా తెరకెక్కుతోంది.విరూపాక్ష సినిమాను నిర్మించిన సుకుమార్ రైటింగ్స్, ఎస్ వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.ఈ మూవీలో సాంకేతిక నిపుణులను విరూపాక్ష మూవీకి పనిచేసిన వారినే రిపీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరో 100 కోట్లు లోడింగ్..?
ఆల్రెడీ 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన యువ సామ్రాట్ నాగచైతన్య విరుపాక్ష మూవీతో ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్న కార్తీక్ దండు కలయిక లో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మూవీ టీం రిలీజ్ చేసిన వీడియో కూడా ఉండడంతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరగాయని చెప్పొచ్చు. నాగచైతన్య ఫ్యాన్స్ అయితే మరో 100 కోట్ల సినిమా లోడింగ్ అవుతున్నట్లు సంబరపడిపోతున్నారు. మరోసారి డిఫరెంట్ క్యారెక్టర్ లో తమ అభిమాన కథానాయకుడు ఇరగదీస్తాడని అనుకుంటున్నారు. ఈ సినిమా నటుడుగా మరో మెట్టు ఎక్కించేలా ఉంటుందని మూవీ టీం రిలీజ్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.