టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున (King Nagarjuna)సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కినేని వారసుడిగా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయి యువ సామ్రాట్ గా తన యాక్టింగ్ తో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. తనెంత కంప్లీట్ యాక్టర్ అని చెప్పడానికి ఒక్క అన్నమయ్య మూవీ చాలు. ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడి సినిమాలను చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నారు.
రీసెంట్ గా ధనుష్ కాంబోలో కుబేర(kubara), రజినీకాంత్ కాంబోలో కూలీ(kooli) మూవీస్ లో నాగ్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. కొంతకాలంగా తన100 వ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తమ అభిమాన హీరో మైల్ స్టోన్ మూవీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఆ మూవీకి సంబంధించిన పనులు చకచకా పూర్తవుతున్నాయి.
లాటరీ కింగ్ గా నాగ్..
ఇప్పటికే ఈ మూవీ ని డైరెక్ట్ చేసే అవకాశం తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ రా కార్తీక్(raa Karthik)దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూవీ టైటిల్ ను లాటరీ కింగ్ (laatari King) అని మూవీ టీం ఫిక్స్ చేసింది. నాగ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనబడబోతున్నట్టు తెలుస్తోంది. ఇక నాగ్ శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన కామెడీ బ్లాక్ బస్టర్ కింగ్ మూవీలో సాంగ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఆ మూవీకి మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad)ఇప్పుడు లాటరీ కింగ్ కు కూడా మ్యూజిక్ ఇస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ కూడా ఖచ్చితంగా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు.
అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో..
అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లోనే (Annapurna studios bannar)మూవీని నిర్మిస్తున్నారు. నాగ్ ముగ్గురు హీరోయిన్లతో జత కట్టబోతున్నట్టు తెలుస్తోంది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మూవీ రానుందట. నాగ్ కెరీర్ లో ప్రెస్టీజియస్ మూవీ కావడంతో స్క్రిప్ట్ పకడ్బందీగా ఉండేట్లు చూసుకున్నారట. ఈ మూవీలో నాగచైతన్య ఒక కామియో రోల్ లో కనబడబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. మంచి ముహూర్తం చూసి అతి త్వరలోనే మూవీని సెట్స్ పైకి తీసుకురావాలని మూవీ టీం ప్లాన్ చేస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    