నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan ram) బింబిసారా మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. అంతకుముందు తీసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ లే అయ్యాయి. ఆ తర్వాత వశిష్ట మల్లిడి( Vasishta mallidi) డైరెక్షన్లో బింబిసారా మూవీ తీసి భారీ హిట్టు కొట్టాడు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ ప్లస్ గా మారింది. ఆ తర్వాత డెవిల్ మూవీ తీస్తే ఫర్వాలేదనిపించింది.
ఈ మూవీ తర్వాతే బింబిసార-2
బింబిసార -2 అనౌన్స్ చేసినా మళ్లీ ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వలేదు. వశిష్ఠ ఈ మూవీ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవితో మూవీ ఆపర్చునిటీ రావడంతో అటు షిఫ్ట్ అయిపోయాడు. కళ్యాణ్ రామ్ బింబిసారా -2 ను వేరే ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడని తెలుస్తోంది.
Kalyan ram మూవీ టైటిల్ ఫిక్స్..
ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాను ప్రదీప్ చిలుకూరి (Pradeep chilukuri) డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ మూవీ చాలా రోజుల కిందటే ప్రారంభమైంది. ఈ మూవీ లో లేడి సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanti) నటిస్తుంది. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయశాంతి ఇకపై సినిమాలు తీయను అని స్టేట్ మెంట్ ఇచ్చింది. కానీ కళ్యాణ్ రామ్ (Kalyan ram) నటిస్తున్న ఈ మూవీ కథ నచ్చడంతో అందులోనూ తన రోల్ పవర్ ఫుల్ గా ఉండడంతో మూవీని చేయడానికి ఒప్పుకున్నారు.ఈ మూవీలో చాలా రోజుల తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా మునుపటి విజయశాంతిని చూపెట్టారు. దీనితో ఈ మూవీపై ఆడియన్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచుకున్నారు.
మూవీకి టైటిల్ మాత్రం ఇంతవరకు ఫిక్స్ చేయలేదు. కొన్ని రోజులుగా రకరకాల టైటిల్స్ అనుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్ గా ఈ మూవీకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే ఒక పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ అయినట్లు ఫిలిం నగర్ టాక్. అశోక్ క్రియేషన్స్ బ్యానర్లో ఆశోక్ వర్ధన్ ముప్పా సునీల్ బలుసు ప్రొడ్యూసర్లు గా సయూ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. కాంతార మూవీకి మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్ నాథ్ (Ajaneesh loknath) ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ పై అధికారిక ప్రకటనను మేకర్స్ రివీల్ చేయాల్సి ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..