National Farmers Day : మన భారతదేశంలో జాతీయ రైతుల దినోత్సవాన్ని కొన్నేళ్లుగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది డిసెంబరు 23న కిసాన్ దివస్‌గా దీన్ని నిర్వహించుకుంటున్నాం. దివంగత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి (Charan Singh) సందర్భంగా ఆయన స్మారకార్థం ఈ వేడుకను జరుపుకుంటున్నాం. ఈ కిసాన్ దివస్‌ను మన పాలకులు రైతులకు అంకితం చేశారు. దేశానికి వెన్నుముక అయిన అన్నదాతను గౌరవించడానికి, కృతజ్ఞతలు తెలపడానికి ఈ వేడుకను మనుగడలోకి తెచ్చారు. నేడు కిసాన్ దివస్. ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు భారతదేశం దీన్ని నిర్వహిస్తోంది.
కిసాన్ దివస్ ( National Farmers Day ) చరిత్ర
చౌదరి చరణ్ సింగ్ 1979 నుంచి 1980 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పని చేశారు. రైతుల సంక్షేమానికి పాటుపడిన ఆయన వ్యవసాయరంగ అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. అనేక విధానాలను ప్రవేశపెట్టి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రధానంగా భూసంస్కరణలు, వ్యవసాయ ఉత్పాదకత పెంపుతోపాటు రైతుల హక్కుల పరిరక్షణపై ఆయన దృష్టి సారించారు. చరణ్ సింగ్ అమలు చేసిన విధానాలు రైతులకు నేటికీ బహుప్రయోజనకరంగా ఉన్నాయి. గ్రామీణాభివృద్ధిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. డిసెంబరు 23న చరణ్‌సింగ్ ( జన్మించారు. వ్యవసాయ రంగానికి ఆయన చేసిన స్మరించుకొనేందుకు ఈ రోజును కిసాన్ దివస్‌గా జరుపుకుంటున్నాం.
ఎందుకు ఇంత ప్రాధాన్యం?
జాతీయ రైతుల దినోత్సవం రైతులు భారత ఆర్థిక వ్యవస్థలో పోషిస్తున్న కీలక పాత్రను గుర్తుచేస్తుంది. భారతదేశం ప్రధానంగా ఒక వ్యవసాయాధారిత దేశం కాగా ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం రైతులపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ కిసాన్ దివస్ ప్రాధాన్యత కలిగి ఉంది.
కొత్త ఆలోచనలు.. ఆవిష్కరణలకు వేదిక
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, పంటలకు న్యాయమైన మద్దతు ధర కల్పించడం, వాతావరణ మార్పులతో సంభవించే విపత్కర పరిస్థితుల నుంచి అన్నదాతలను రక్షించడం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ఆవిష్కరించడం వంటి అంశాలను సమీక్షించుకోవడానికి ఈ కిసాన్ దివస్ ఒక సందర్భంగా పరిగణమిస్తుంది. సంక్షేమ పథకాలు, సంస్కరణల ద్వారా రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడంపై చర్చించడానికి ఒక అవకాశం కల్పిస్తుంది.
జాతీయ వేడుకగా కిసాన్ దివస్
జాతీయ రైతుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో అత్యంత ఘనంగా దీన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. రైతులు తమ అవసరాలు, ఆకాంక్షలను చర్చించడానికి వేదికగా ఈ వేడుకలు నిలుస్తాయి. ఈ సందర్భంగా సైన్స్అండ్ టెక్నాలజీలోని కొత్త ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేస్తారు. తద్వారా వ్యయసాయ ఉత్పాదకతను మెరుగుపరుస్తారు.
రైతుల సంక్షేమానికి అమలవుతున్న పథకాలు
రైతుల సంక్షేమానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలు, పథకాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ దివస్ సందర్భంగా ప్రకటించేందుకు లేదా అమలు చేయేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అలాంటి ముఖ్యమైనన పథకాలు ఏమిటో చూద్దాం.
- ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN): ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ. 6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. 2. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ (Soil Health Card): ఈ పథకం ద్వారా రైతులకు మట్టి గుణాత్మకతను పెంపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను అందిస్తారు.
- ఫసల్ బీమా యోజన (Crop Insurance): వాతావరణ మార్పుల వల్ల పంట నష్టపోతే రైతులకు భద్రత కల్పించే పథకం. అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు
- గిట్టుబాటు ధరలు : రైతులు తమ పంటకు సరైన ధరలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
- వాతావరణ మార్పు ప్రభావం: పంట ఉత్పత్తిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
- పాలన సమస్యలు: మారుతున్న వ్యవసాయ విధానాలు, అధునాతన సాంకేతికతలకు రైతులు సరైన విధంగా స్వీకరించలేని సమస్యలు ఉన్నాయి.
రైతుల కోసం కొత్త ఆవిష్కరణలు
- డ్రిప్ ఇరిగేషన్: నీటి వినియోగాన్ని తగ్గించి పంటలకు తగినంత నీటిని అందించడంలో ఇది సహాయపడుతుంది.
- డ్రోన్లు, సెన్సార్లు: పంటలను పర్యవేక్షించడం, పురుగు మందులు చల్లడం వంటి పనుల్లో వినియోగిస్తున్నారు.
- అధునాతన విత్తనాలు: అధిక దిగుబడులను అందించగల ఆధునాతన విత్తనాల ప్రయోగం.
కిసాన్ దివస్ ఏం సందేశం ఇస్తుంది?
రైతులు భారత దేశానికి ఎంతగానో అవసరమని కిసాన్ దివస్ గుర్తు చేస్తుంది. అన్నదాతలను గౌరవించడం, వారి సంక్షేమం కోసం ముందుకు రావడం అవసరమని చాటిచెబుతుంది. రైతుల కోసం ఎలాంటి చేయూత ఇవ్వగలమో పాలకులు, సామాన్య ప్రజలు చర్చించుకునే అవకాశాన్ని ఈ కిసాన్ దివస్ దోహదపడుతుంది. రైతే రాజు అనే నినాదానికి ప్రతీకగా నిలుస్తుంది. రైతుల సంక్షేమానికి మనం చేయగలిగే సహకారం, వారి జీవితాలను, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..