నాచురల్ స్టార్ నాని (natural Star Nani)ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వందకోట్ల హీరో అయ్యాడు. చిన్న చిన్న సినిమాలు తీస్తూ తన టాలెంట్ తో ఇప్పుడు పెద్ద హీరోగా ఉన్నాడు. కెరియర్ లో కొన్ని ఫ్లాప్ లు ఉన్న మంచి కథలను సెలక్ట్ చేసుకుని సూపర్ హిట్లు కొట్టాడు. పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ హీరో నుండి 100 కోట్ల హీరోగా మారడం అంటే మామూలు విషయం కాదు.
ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రేంజ్ లో ఎదగడం కొద్ది మందికే సాధ్యమైంది. అందులో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత రవితేజ(mass maharaj Ravi Teja)చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మాస్ మహారాజా అయ్యారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఆడతాయో మనకు తెలిసిందే. ఇక తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని హీరోగా మారి నాచురల్ స్టార్ గా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు.
Nani వాల్ పోస్టర్ పై సూపర్ హిట్స్..
హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే వాల్ పోస్టర్ (Wall poster) నిర్మాణ సంస్థను స్థాపించి కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూ స్టోరీ బేస్డ్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలా చేయడం అవి హిట్లుగా నిలవడంతో నాని బ్యానర్ పై మూవీ వస్తుందంటే చాలు మూవీలో ఏదో విషయం ఉంటుందని ఆడియన్స్ నమ్మి థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఒక హీరో నిర్మాతగా మారి ప్రజెంట్ జనరేషన్ లో ఇలా వరుసగా హిట్లు కొట్టడం అనేది నానికే చెల్లింది.
టాలెంటెడ్ డైరెక్టర్ పరిచయం..
డీ ఫర్ దోపిడితో ప్రొడ్యూసర్ గా మారి, కొన్ని సంవత్సరాలకు అ అనే డిఫరెంట్ మూవీని కూడా నిర్మించారు. ఈ మూవీతోనే ప్రశాంత్ వర్మ (Prashanth varma)అనే టాలెంట్ డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత హిట్ (HIT) మూవీ తో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ వరుసలోనే హిట్ సెకండ్ కేసు మంచి విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా వచ్చిన కోర్టు (Court)మూవీ అయితే సెన్సేషనల్ హిట్టు అయింది. విడుదలకు ముందు నాని ఆడియన్స్ తో కోర్టు మూవీ మీకు నచ్చకపోతే నెక్స్ట్ నేను తీయబోయే హిట్ ది థర్డ్ కేస్(Hit The third case)అనే మూవీని మీరు చూడొద్దు అని చెప్పారంటే ఎంత కాన్ఫిడెంట్ తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అనుకున్నట్టుగానే ఆ మూవీ విడుదలై సంచలన విజయం సాధించింది.
డబుల్ హ్యాట్రిక్…
ఇలా నాని ప్రొడ్యూసర్ (Producer Nani) గా వరుసగా ఐదు సూపర్ హిట్లు అందుకున్నారు. ఇంకా ఒక హిట్టు కొడితే ప్రొడ్యూసర్ గా వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోగా నిలిచిపోతారు. కేవలం డబ్బుల కోసం కాకుండా ఆడియన్స్ కి మంచి సినిమాలను అందించే ఉద్దేశంతో మూవీలను నిర్మిస్తున్న నాని మెగాస్టార్ చిరంజీవితో కూడా శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) డైరెక్షన్లో రాబోతున్న మూవీని నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసే రేంజ్ కి ఎదగడం అభినందనియమే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..