Hyderabad Tourism| హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం ఆవిర్భవించనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 100 అడుగుల స్టాచ్యూ (NTR Statue) ఏర్పాటు కానుంది. మహానటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao) గౌరవార్థం ఆయన భారీ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదించారు.
విగ్రహం ఎక్కడంటే…
ఎన్టీఆర్ సాహిత్య కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆయన కుమారుడు మోహనకృష్ణ, కమిటీ అధ్యక్షుడు టి.డి.జనార్దన్, సభ్యుడు మధుసూదనరాజు సీఎంతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. విగ్రహం ఏర్పాటు ప్రదేశం, ప్రణాళికలు, భూ కేటాయింపు తదితర అంశాలను సమీక్షించారు. హైదరాబాద్‌లోని ఔట్‌రింగ్‌రోడ్డు (ORR) సమీపంలో ఈ స్టాచ్యూను స్థాపించాలని నిర్ణయించారు.
అభ్యర్థను ఆమోదించిన రేవంత్
ఎన్టీఆర్ సాహిత్య కమిటీ సభ్యులు ఈ ప్రాజెక్ట్ కోసం భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister A Revanth Reddy)ని అభ్యర్థించారు. ఈ విగ్రహం ఎన్టీఆర్‌కు సముచిత గౌరవంగా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి సమ్మతించారు. విగ్రహ ఏర్పాటుకు భూమిని కేటాయించేందుకు అంగీకరించారు.
ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్‌గా..
Hyderabad Tourism Places : హైదరాబాద్‌లో స్థాపించనున్న ఎన్టీఆర్ విగ్రహం ప్రదేశం ఒక ఒక స్మారక చిహ్నం మాత్రమే కాకుండా నాలెడ్జ్ సెంటర్‌గా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, ఫిల్మ్ కెరీర్, ఆయన రాజకీయ జీవితం తదితర అంశాలపై ఈ కేంద్రం ప్రజలకు, పర్యాటకులకు సమాచారం అందించనుంది. ఇది హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రంగా ఆకర్షించనుంది.
హైదరాబాద్‌లో భారీ విగ్రహాలు
- హైదరాబాద్ ఇప్పటికే రెండు అత్యంత పెద్ద విగ్రహాలకు ప్రసిద్ధి చెందాయి.
- రామానుజాచార్య విగ్రహం : ముచ్చింతల్‌లోని ఈ విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంది. ఇది భక్తులకు, పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం : తెలంగాణ సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ సరస్సు పక్కన ఉన్న ఈ విగ్రహం 125 అడుగుల ఎత్తులో ఉంది.
- ఇప్పుడు ఎన్‌టిఆర్ విగ్రహం కూడా హైదరాబాద్‌లో మరో విశిష్ట చిహ్నంగా నిలవనుంది. ఇది ఆయన గౌరవప్రదమైన స్మారకంగా మాత్రమే కాకుండా హైదరాబాద్ పర్యాటక రంగానికి విశేష ఆకర్షణగా నిలవనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] గత 20 రోజుల్లో మంగళ్‌హాట్ పోలీసులు (Hyderabad Mangalhat police) పలు దుకాణాలపై దాడులు చేసి […]