New Jobs in TGSRTC : తెలంగాణ (Telangana) నిరుద్యోగులకు (unemployed youth) ఓ సవర్ణావకాశం దక్కనుంది. రోడ్డు రవాణా సంస్థ (Road Transport Corporation (RTC)లో కొలవుల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ( state government) శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నియామకాలు చేపడుతోంది. వివిధ కేటగిరీలో మొత్తం 3,038 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు త్వరలోనే TGSRTC అధికారిక నోటిఫికేషన్ (official notification) రానుంది.
సర్కారు ఎందుకు స్పందించింది?
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీజీ ఆర్టీసీ (TGSRTC)లో కొన్నేళ్లుగా పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీకి అవకాశం ఉన్నా ఈ ప్రక్రియలో జాప్యమైంది. ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న ఉద్యోగులపైనే అధిక పనిభారం పడుతోంది. దీంతోపాటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy government) మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం పథకాన్ని (Mahalakshmi Scheme) ప్రవేశపెట్టి, బస్సుల సంఖ్య పెంచింది. అయితే.. అందుకు అనుగుణంగా డ్రైవర్ల సంఖ్యలేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అలాగే బస్సు సర్వీసులు పెరగడం వల్ల డిపోల్లోని ఇతర విభాగాల్లోనూ ఉద్యోగులకు పనిభారం పెరిగింది. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం చేయడమే కాకుండా అదనపు సేవలకు అనుగుణంగా నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్న ఉద్యోగులపైనే ఓవర్ బడెన్ పడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. తమకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కొలవులకు శ్రీకారం చుడుతోంది.
TGSRTC : ఎలా ప్రారంభమైంది ఈ ప్రక్రియ?
ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Transport Minister Ponnam Prabhakar) నిన్న మీడియాతో మాట్లడం పట్ల నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. మొత్తం 3,038 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలో అధికారిక నోటిఫికేషన్ వెలువడనుందని ఆయన చెప్పారు. పలుమార్లు ఆలస్యమైనా చివరకు ఈ ప్రక్రియను ప్రభుత్వం త్వరితగతిన చేపడుతోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka) విశేషంగా కృషి చేశారని కొనియాడారు. గతంలోనే ఈ నియామక ప్రక్రియను ప్రారంభించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ అంశం వల్ల కొంత కాలం ఆలస్యమైందని వివరించారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగుమమైందన్నారు.
ఎవరెవరికి ఉద్యోగ అవకాశాలు?
ఈసారి విడుదల కానున్న ఉద్యోగాల్లో పలు విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. డ్రైవర్లు, మెకానికల్ ఇంజనీర్లు, ట్రాఫిక్ విభాగం, మెడికల్ విభాగం, అకౌంట్స్, సివిల్ విభాగం వంటి అనేక విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
New Jobs in TGSRTC : భర్తీ కానున్న పోస్టుల వివరాలు
- డ్రైవర్స్ -2,000
-శ్రామిక్ (వర్కర్)- 743 - డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)- 84
-డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్)- 114
-డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్-25
-అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18 - అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23
-సెక్షన్ ఆఫీసర్ (సివిల్)-11 - అకౌంట్స్ ఆఫీసర్లు-6
- మెడికల్ ఆఫీసర్లు (జనరల్) – 7
- మెడికల్ ఆఫీసర్లు (స్పెషలిస్ట్) – 7
ఎవరెవరు అర్హులు?
ఆర్టీసీ ఉద్యోగాలు విభిన్నమైనవి కాబట్టి పదో తరగతి నుంచి డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, మెడికల్ చదివిన వారికి కూడా ఈ అవకాశాలు ఉంటాయి. ప్రతి పోస్టుకూ సరిపోయే విద్యార్హతలు త్వరలో నోటిఫికేషన్‌లో ప్రకటిస్తారు. ఈ పోస్టుల్లో కొన్నింటికి డ్రైవింగ్ లైసెన్స్, ఇతర నైపుణ్యాలూ అవసరమవుతాయి.
TGSRTC : నోటిఫికేషన్ ఎప్పుడు?
ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదలకు ఇక చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. త్వరలో TGSRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అభ్యర్థులు ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ కోసం తరచూ వెబ్‌సైట్ చెక్ చేయాలి.
.