New Municipal Corporations in Telangana : పట్టణాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది.ఇవి అందుబాటులోకి వస్తే.. రాష్ట్ర పట్టణ వ్యవస్థ.. 13 మునిసిపల్ కార్పొరేషన్లు, 141 మునిసిపాలిటీల నుండి విస్తరిస్తుంది.మహబూబ్‌నగర్, మంచిర్యాల నగరాలను మున్సిపల్ కార్పొరేషన్‌లుగా అప్‌గ్రేడ్ చేస్తారు.
కొత్త మున్సిపాలిటీలు:
- కోహీర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్ (సంగారెడ్డి జిల్లా);
- కేసముద్రం (మహబూబాబాద్);
- స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ);
- మద్దూరు (నారాయణపేట);
- ఏదులాపురం (ఖమ్మం);
- అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం),
- చేవెళ్ల, మొయినాబాద్(రంగారెడ్డి )
పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో గ్రామాల విలీనం
రాష్ట్ర ప్రభుత్వం చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాలను కూడా మునిసిపల్ బాడీల్లో విలీనం చేయాలని నిర్ణయించింది. పరిగి మున్సిపాలిటీలో ఆరు గ్రామాలు, నర్సంపేట మున్సిపాలిటీలో ఏడు, నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కో గ్రామం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆరు గ్రామాలు విలీనం కావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..