New Osmania Hospital : కార్పొరేట్ హాస్పిటల్ ను తలదన్నేలా అత్యాధునిక సౌకర్యాలతో ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి అడుగుపడింది. హైదరాబాద్ గోషామహల్ (Goshamahal) పోలీస్ గ్రౌండ్‌లో 27 ఎకరాల్లో సుమారు 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవన నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. మొత్తం 30 డిపార్ట్‌మెంట్‌లు, 2వేల పడకలు, ఫిజియోథెరపీ, డెంటల్, కాలేజ్‌లు, హాస్టల్ వసతులతో అత్యాధునిక ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital )లో అనుగుణంగా హెలిప్యాడ్ వసతి, హాస్పిటల్ మురుగు నీరు శుద్ధి చేసేందుకు ప్రత్యేక ప్లాంట్, విశాలమైన పార్కింగ్ ఫెసిలిటీలను కల్పించనున్నారు. ఈ ఆస్పత్రిన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు.
ప్రతీ డిపార్ట్‌మెంట్కు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్
ప్రతి డిపార్ట్‌మెంట్ కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌తో కూడిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూ వార్డులు అందుబాటులో ఉంటాయన్నారు. కిడ్నీ, లివర్, స్కిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల కోసం అత్యాధునిక టెక్నాలజీ గల ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం కొత్త ఉస్మానియాలో అందుబాటులోకి తీసుకురానున్నారు. పేషెంట్ల సౌకర్యార్థం అన్ని రకాల రోగనిర్ధారణ సేవలను ఒకే చోటకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు.
Osmania Hospital ఆవరణలోనే హాస్టల్స్.. ఆడిటోరియం
గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఔట్ పేషెంట్ సేవలు అందించాలని.. పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్, కనీసం ప్రతిరోజు 3 వేల నుంచి 5 వేల మంది రోగులు వచ్చే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా ఓపీ కౌంటర్లను నిర్మించనున్నారు. ఓపీ టోకెన్ల కోసం రోగులు, బంధువులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడే ప్రసక్తే ఉండకుండా నిర్మాణాలు చేపట్టనున్నారు. కొత్త ఉస్మానియాలో నర్సింగ్, డెంటల్, ఫిజియో థెరపీ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యవిద్యార్థుల కోసం ఉస్మానియా హాస్పిటల్ ఆవరణలోనే హాస్టళ్లను నిర్మించనున్నారు. అంతేకాకుండా 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియంను కూడా అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.
- ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ ( Old Osmania Hospital ) హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో శిథిలావస్థలో ఉండగా.. కొత్త ఆస్పత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మిస్తున్నారు.
- మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 వేల పడకల కెపాసిటీతో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు కార్పొరేట్ హాస్పిటల్స్ ను తలదన్నేలా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.
- వచ్చే వంద సంవత్సరాలకు సరిపోయేలా ఉస్మానియా హాస్పిటల్ ను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
- ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లు ఉంటాయి.
- అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. ఆస్పత్రికి అందుబాటులోనే ఫైర్ స్టేషన్, రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మిస్తారు. ఆసుపత్రి ప్రాంగణంలో అత్యవసర సమయాల్లో రాకపోకలు సాగించేందుకు వీలుగా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు సులువుగా వచ్చేలా ర్యాంప్‌లు నిర్మించనున్నారు.
- రోగుల అటెండర్లు, బంధువులు సేద తీరేందుకు డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









1 Comment
[…] అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆర్ట్స్ కాలేజీ భవనంలో నుంచి బలవంతంగా బయటకు […]