New Ration Card Applications : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్ కార్డుల (Food Security Cards) కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మీసేవ పోర్టల్ (Meeseva Portal) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీ సేవ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. అయితే.. తొలి రోజే కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. సర్వర్ డౌన్ లాంటి సమస్యలు కారణంగా రేషన్‌కార్డుల దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం అవుతోంది. దీంతో దరఖాస్తుదారులు గంటల కొద్దీ క్యూలో వేచి చూడాల్సి వస్తోంది.
New Ration Card Applications ప్రక్రియ ఇలా..
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు (New Ration Card Applications ) చేసుకునే విధానం ఎంతో సులభం. తెలంగాణ (Telangana) ప్రభుత్వం అందించిన మార్గదర్శకాల ప్రకారం మీసేవ కేంద్రాల ( MeeSeva centers) ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే.. ఇది వరకే ప్రజాపాలనలో గానీ ఆన్‌లైన్‌లో గానీ దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. అలాగే ఇది వరకే ఉమ్మడి కుటుంబం కార్డులో పేరు కలిగి ఉంటే అందులోంచి తొలగించుకున్నాకే కొత్తగా మరో దానికి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు.
అవసరమైన డాక్యుమెంట్లు
- కుటుంబంలో అందరి ఆధార్ కార్డులు
- ప్రస్తుత నివాసాన్ని నిరూపించేందుకు అవసరమైన విద్యుత్ బిల్లు లేదా రెంట్ అగ్రిమెంట్
- కుటుంబ యజమాని బ్యాంక్ పాస్‌బుక్
- పాత రేషన్ కార్డు (ఉంటే)
- ఆదాయ ధృవీకరణ పత్రం (ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోపుగా ఉంటే మాత్రమే అర్హత)
మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం
- మీసేవ కేంద్రానికి వెళ్లి రేషన్ కార్డు దరఖాస్తు ఫారాన్ని (New Ration Card Applications ) తీసుకోవాలి.
- అందులో అన్ని వివరాలు స్పష్టంగా పూర్తి చేయాలి.
- డాక్యుమెంట్లు స్కాన్ చేసి అటాచ్ చేయాలి.
- దరఖాస్తు ఫీజు రూ.50 మాత్రమే చెల్లించాలి.
- దరఖాస్తును సమర్పించిన తర్వాత, మీకు ఒక అప్లికేషన్ నంబర్ అందజేస్తారు. దీని ద్వారా దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు
- మీసేవ అధికారిక వెబ్‌సైట్ (www.ts.meeseva.telangana.gov.in) సందర్శించాలి.
- కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫారాన్ని ఎంచుకోవాలి.
- అవసరమైన అన్ని వివరాలను పూరించాలి.
- డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లింపు పూర్తిచేయాలి.
- అప్లికేషన్ నంబర్‌ను భద్రపరచుకోవాలి.
అర్హతా ప్రమాణాలు
ప్రభుత్వం ప్రకటించిన కొత్త రేషన్ కార్డులకు అర్హత కలిగి ఉండే కుటుంబాలు నిర్దేశించిన ఆదాయ పరిమితిని మించకూడదు. పేద కుటుంబాలు, తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నవారు, నిరుద్యోగులు, ఒకే ఒక ఆదాయ వనరు కలిగిన కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పౌరసరఫరాల శాఖ నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు అనర్హులు.
తొలి రోజే ఆటంకాలు
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మొదలైన తొలిరోజే మీసేవ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు. అయితే.. సర్వర్ సరిగా పనిచేయక ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు సరైన సమాచారం అందకపోవడం వల్ల అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకంగా, ప్రజలకు సముచిత సమాచారం అందించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
హెల్ప్‌లైన్స్ ఇవే…
రేషన్ కార్డు దరఖాస్తు, అప్లికేషన్ స్టేటస్, ఇతర సమస్యలకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-425-5901తోపాటు పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ www.civilsupplies.telangana.gov.in అలాగే మెయిల్ support@tscivilsupplies.gov.inను అందుబాటులోకి తెచ్చింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..