News Ration Cards | నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తెల్లరేషన్ కార్డులు మరికొన్ని రోజుల్లో అందునున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత పదేళ్లకు పైగా అన్ని అర్హతలు ఉన్నా.. తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో అనేక మంది అర్హులై పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.
News Ration Cards : జిల్లాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇలా
- హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో లక్ష కార్డులు
- హైదరాబాద్ – 285,
- వికారాబాద్ జిల్లా- 22 వేలు,
- నాగర్‌కర్నూల్ జిల్లా- 15 వేలు,
- నారాయణపేట జిల్లా- 12 వేలు,
- వనపర్తి జిల్లా- 6 వేలు,
- మహబూబ్‌నగర్ జిల్లా- 13 వేలు,
- గద్వాల్ జిల్లా- 13 వేలు,
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా- 6 వేలు,
- రంగారెడ్డి జిల్లా- 24 వేలు
మార్చి 8 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మిలిగిన జిల్లాల్లో రేషన్ కార్డుల (News Ration Cards ) పంపిణీ కార్యక్రమం చెబుతున్నారు. కాగా, 2014 నుంచి బిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. ఈ పదేళ్లలో లక్షల మంది వివాహాలు చేసుకుని కొత్త కాపురాలు పెట్టారు. ప్రభుత్వ పథకాలు ఏమైనా అందాలంటే రేషన్ కార్డులు ప్రామాణికం. కార్డులు లేక అనేక మంది సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ప్రజలు కూడా తమకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎన్నో ఏళ్లుగా గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగానే 2025 జనవరి 26న 16,900 కుటుంబాలకు మొదటి విడతగా రేషన్ కార్డులు మంజూరు చేసింది . మరోసారి ఈ ప్రక్రియ చేపట్టి మరికొన్ని కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. తాజాగా మీ సేవా కేంద్రాల నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








