Sarkar Live

Nimisha Priya | కేరళ నర్సుకు మ‌ర‌ణ శిక్ష‌.. అస‌లేం జ‌రిగింది?

Nimisha Priya: యెమ‌న్‌లో ప‌నిచేస్తున్న కేరళ న‌ర్సు నిమిషా ప్రియాకు మ‌ర‌ణ శిక్ష ప‌డింది. 2017లో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో అక్క‌డి కోర్టు ఇటీవ‌ల‌ దీన్ని విధించ‌గా తాజాగా ఆ దేశ అధ్య‌క్షుడు అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమోదం

Nimisha Priya

Nimisha Priya: యెమ‌న్‌లో ప‌నిచేస్తున్న కేరళ న‌ర్సు నిమిషా ప్రియాకు మ‌ర‌ణ శిక్ష ప‌డింది. 2017లో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో అక్క‌డి కోర్టు ఇటీవ‌ల‌ దీన్ని విధించ‌గా తాజాగా ఆ దేశ అధ్య‌క్షుడు అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమోదం తెలిపారు.

పూర్వప‌రాలు ఏమిటంటే..

నిమిషా ప్రియా 2011లో తన కుటుంబంతో కలిసి యెమెన్ వెళ్లింది. సనా అనే ప్రాంతంలో ఆమె ఒక క్లినిక్ నడిపేది. యెమెన్ చట్టాల ప్రకారం విదేశీయులు వ్యాపారం నిర్వహించాలంటే స్థానిక భాగస్వామిని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆమె తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తిని తన క్లినిక్‌లో బిజినెస్ పార్ట్‌న‌ర్‌గా చేర్చుకుంది. కొన్నాళ్ల తర్వాత నిమిషాను మహదీ వేధించడం ప్రారంభించాడు. వ్యాపారానికి సంబంధించిన డబ్బు బలవంతంగా తీసుకోవడం, ఆమె పాస్‌పోర్టు లాక్కోవ‌డం లాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో నిమిషా పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ సరైన స్పందన లభించలేదు.

చివ‌ర‌కు Nimisha Priya ఏం చేసిదంటే..

త‌న పాస్‌పోర్టును తిరిగి ఇచ్చేందుకు మ‌హ‌దీ నిరాక‌రించ‌డ‌మే కాకుండా అనేక‌ ఇబ్బందులు క‌లిగిస్తుంటంతో నిమిషా తీవ్ర ఆందోళ‌న చెంది. ఈ క్ర‌మంలో 2017లో నిమిషా అతడికి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత తన పాస్‌పోర్టు తీసుకోవాలని భావించింది. కానీ, మత్తుమందు అధిక మోతాదుతో మహదీ మృతి చెందాడు. మ‌హ‌దీ మ‌ర‌ణానికి మ‌త్తు మందే కార‌ణ‌మ‌ని అక్క‌డి వైద్యులు నిర్ధారించారు.

దోషిగా తేల్చిన కోర్టు

మ‌హ‌దీ హ‌త్య కేసులో యెమ‌న్ కోర్టు నిమిషాను 2018లో దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. దీంతో ఆమె 2023లో యెమెన్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖ‌లు చేసింది. నిమిషా అభ్య‌ర్థ‌న‌ను సుప్రీం కోర్టు తిర‌స్క‌రించింది.

నిమిషాకు కోర్టు విధించిన మ‌ర‌ణశిక్ష‌ను యెమెన్ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. అయితే.. హత్యకు గురైన మహదీ కుటుంబం నిమిషాను క్షమిస్తే రక్తపరిహారం (దియా) చెల్లించి ఆమె ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. నిమిషా తల్లి ప్రేమ కుమారి ఈ కేసులో తన కుమార్తెను రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఆమె ఇప్పటికే యెమెన్ వెళ్లి మహదీ కుటుంబంతో మాట్లాడింది. పరిహారంగా డబ్బు ఇచ్చి వారి క్షమాభిక్ష పొందే ప్రయత్నం చేస్తోంది.

Nimisha Priyaకు కేంద్ర ప్రభుత్వ స‌హ‌కారం

భారత ప్రభుత్వం కూడా ఈ కేసు పరిష్కారానికి తోడ్పాటును అందిస్తోంది. నిమిషా ప్రియాకు న్యాయపరమైన సహాయం చేయడంలోనూ, ఆమెకు న్యాయం చేయడంలోనూ కృషి చేస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది.

జైలు గోడ‌ల మ‌ధ్య Nimisha

యెమెన్ జైలు గోడల మధ్య నిమిషా ప్రియా సంకట పరిస్థితుల్లో ఉంది. భారత ప్రభుత్వం, కుటుంబం, మద్దతుదారుల సహకారంతో ఆమెకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉంది. మహదీ కుటుంబం క్షమాభిక్ష పెడితే నిమిషా ప్రియాను మరణశిక్ష నుంచి రక్షించొచ్చు. ప్రస్తుతం, ఆమె కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఈ విషయంలో విజయం సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

  • […] కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో ప‌నిచేసే త‌న స‌హోద్యోగి త‌న శరీర నిర్మాణంపై అస‌భ్య‌క‌రంగా మాట్లాడాడ‌ని అదే సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఓ మ‌హిళా ఉద్యోగి పోలీసుస్టేష‌న్‌లో గ‌తంలో ఫిర్యాదు చేసింది. త‌న‌కు ఈ వేధింపులు 2013 నుంచి ప్రారంభ‌మ‌య్యాయ‌ని పేర్కొంది. క్ర‌మేణా అత‌డి దుశ్చ‌ర్య‌లు అధిక‌మ‌య్యాయ‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో అత‌డిపై IPC సెక్షన్లు 354A (లైంగిక వేధింపు), 509 (మహిళల మార్యాదను అవమానించడం), అలాగే కేరళ పోలీస్ యాక్ట్ సెక్షన్ 120(o) (అవాంఛనీయ కాల్, లేఖ, సందేశం ద్వారా హింసించ‌డం) కింద కేసు నమోదైంది. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?