Nizamabad : నిజామాబాద్ జిల్లా (Nizamabad) మాక్లూరు మండలం ధర్మోరా(ఏ) గ్రామంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఆదివారం రాత్రి నిజామాబాద్ లోని గౌతమ్ నగర్‌కు చెందిన జిలకర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి ధర్మోరాలో తనకు పరిచయం ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మహిళ బంధువులకు ప్రసాద్‌కు మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి గొడవ పెద్దది కావడంతో ఒకరికొకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో జీలకర్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి స్నేహితుడు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
జంట హత్యలతో గ్రామం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ప్రసాద్‌పై అనేక చోరీ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమా లేదా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.