Obscene Activities : హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో ఉన్న ‘వైల్డ్ హార్ట్’ అనే పబ్‌పై రాచకొండ పోలీసులు (Rachakonda Police) నిన్న (సోమవారం) రాత్రి ఆకస్మికంగా దాడులు (Raid) చేశారు. మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పబ్ యజమాని (Owner), 10 మంది కస్టమర్లు (Customers), 17 మంది మహిళా డ్యాన్సర్లు (Female Dancers) ఉన్నారు.
చట్ట విరుద్ధంగా నిర్వహణ
రాచకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పబ్ యజమానులు చట్ట విరుద్ధంగా అసభ్య కార్యకలాపాల (Obscene Activities)తో రాత్రి వేళల్లో యువతను ఆకర్షించేందుకు మహిళా డ్యాన్సర్లతో ప్రదర్శనలు (Dance Shows) నిర్వహిస్తున్నారు. ఇవి ఇవి పూర్తిగా పబ్‌కు మంజూరు చేసిన లైసెన్స్ (Licens) నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారు.
ముంబై నుంచి వచ్చిన డ్యాన్సర్లు
దాడి సమయంలో పోలీసులకు కీలక సమాచారం లభించింది. మహిళా డ్యాన్సర్స్ (Female Dancers)ను నిర్వాహకులు ముంబై నుంచి రప్పించారని తేలింది. వీరిని కాంట్రాక్టర్ ప్రాతిపదికన (Contract Basis) నియమించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. పబ్ యాజమాన్యం వారితో రాత్రి వేళల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒప్పందం చేసుకుందని వెల్లడైంది.
Obscene Activities : పోలీసుల కొరడా
ఈ మొత్తం వ్యవహారం మీద పోలీసులకు ముందు కొన్ని ఫిర్యాదులు అందాయి. పబ్ వద్ద రాత్రిళ్లు అనుమానాస్పదంగా అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా [Surprise Raid] చేపట్టారు. పబ్ నిర్వాహకులు, మహిళా డ్యాన్సర్లతోపాటు కస్టమర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.
వివిధ చట్టాల కింద కేసులు నమోదు
పట్టుబడిన వారిపై పలు కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్లేస్‌లో అసభ్య ప్రవర్తన (Section 294 IPC), అసభ్య వ్యాపార నియంత్రణ చట్టం (ITPA), మద్యం చట్ట ఉల్లంఘన (Excise Act Violation), ప్రజలకు హానికరమైన ప్రవర్తన (Public Nuisance) చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








