Urine Bottle Incident Odisha | ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గజపతి జిల్లా (Gajapati district) ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్ కార్యాలయంలో తాగునీరు అడిగిన అధికారికి అక్కడ పనిచేసే అటెండర్ మూత్రం కలిపిన బాటిల్ ఇచ్చాడు. ఆ నీరు తాగిన అధికారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు. వివరాల్లోకి వెళితే. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ అటెండర్ బెహెరా నాయక్‌ను తాగునీటి బాటిల్ అడిగాడు. దీంతో అతనికి మూత్రం కలిపిన వాటర్ బాటిల్ ఇచ్చాడని ఆరోపించారు. తక్కువ వెలుతురు, పని ఒత్తిడి వల్ల సచిన్ గౌడ తెలియకుండానే ఆ బాటిల్ లోనినీరు తాగాడు.
కొద్దిసేపటికే అతనికి ఎదో తేడాగా అస్వస్థతకు గురైనట్లు అనిపించింది. వెంటనే ఆ నీరు యొక్క స్వభావాన్ని గ్రహించాడు. ఆ తర్వాత అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం బెర్హంపూర్‌లోని MKCG ఆసుపత్రిలో చేరాడు. కాగా గౌడ నీటి నమూనాను ప్రయోగశాల పరీక్షకు పంపాడు, ఆ పరీక్షలో నమూనాలో అమ్మోనియా సాంద్రత సాధారణం కంటే ఎక్కువగా ఉందని తేలింది.
అతను కోలుకున్న తర్వాత, పట్నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ నివేదిక ఆధారంగా, పోలీసులు నాయక్‌ను అదుపులోకి తీసుకుని, తరువాత అరెస్టు చేశారు. తనతో పాటు నివసిస్తున్న మరో ఇద్దరు సిబ్బంది కూడా అదే నీటిని తాగారని, దాని రుచి, నాణ్యత గురించి వారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారని గౌడ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నాయక్ చేసిన ఈ పని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.