One Nation One Election : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లును మంగళవారం లోక్‌సభలో దీనిని ప్రవేశపెట్టనున్నారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు బిల్లులో అవకాశం కల్పించారు. మంగళవారం దిగువ సభ కోసంసం జాబితా చేసిన ఎజెండాలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు.
‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’తో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం, 1963కి సవరణ బిల్లు, ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్, 1991; జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ను కూడా నేడు ప్రవేశపెట్టనున్నారు. . ఈ బిల్లు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలోని అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకువస్తున్నారు.
ఈ నెల ప్రారంభంలో ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి), దాని మిత్రపక్షాలు బిల్లుకు మద్దతు ఇస్తుండగా, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకెతో సహా పలు ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.
రెండు దశల్లో ఎన్నికలు
జమిలి ఎన్నికలపై అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్‌లో ఆమోదించింది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నివేదికలో ఈ సిఫార్సులను వివరించింది. రెండు దశల్లో ఏకకాల ఎన్నికలను అమలు చేయాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. మొదటి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని, సాధారణ ఎన్నికల తర్వాత 100 రోజులలోపు స్థానిక సంస్థల ఎన్నికలను (పంచాయతీ, మునిసిపాలిటీలు) నిర్వహించాలని సిఫార్సు చేసింది. అన్ని ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలని పేర్కొంది.
One Nation One Election Bill ను వ్యతిరేకిస్తున్న ప్రతిక్షాలు
వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది, అధికార BJP, దాని మిత్రపక్షాలు ఈ చర్యకు మద్దతు ఇస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు దాని ఆచరణలో చిక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని, సమగ్ర పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..