CID cracks online Betting racket : చట్ట విరుద్ధ ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారం (online betting racket) పై తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (Telangana CID) మెరుపు దాడులు చేసింది. తెలంగాణ కేంద్రంగా నడుస్తున్న ఈ దందాపై ఉక్కుపాదం మోపింది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల వరకు విస్తరించి ఉన్న ఈ భారీ రాకెట్‌పై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ఈ రాకెట్ వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఆరు యాప్‌ల ద్వారా కోట్ల వ్యాపారం
సీఐడీ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితులు ప్రజలను మోసం చేయడానికి ప్రత్యేకంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను తయారు చేసి వాడుతున్నారు. Taj0077, Fairply.live, Andhra365, Vlbook, Telugu365, Yes365 అనే మొబైల్ యాప్‌ల ద్వారా వేలాది మందిని బెట్టింగ్ ఊబిలోకి దింపారు. తక్కువ పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభం వస్తుందని ఆశ చూపి ప్రజలను ఆకర్షించారు. నమ్మి పెట్టుబడి పెట్టినవారు చివరికి మోసపోయి తమ కష్టార్జితాన్ని కోల్పోయారు. ఈ యాప్‌ల ద్వారా చాలా మంది కుటుంబాలు ఆర్థికంగా (financial losses) కుప్పకూలిపోయాయని సీఐడీ వెల్లడించింది.
ఏకకాలంలో మూడు రాష్ట్రాల్లో దాడులు
ఈ గ్యాంగ్‌పై దాడి చేయడానికి సీఐడీ ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ టీమ్‌లు సోదాలు చేశాయి. ఈ దాడుల్లో అనేక ల్యాప్‌ట్యాబులు, సర్వర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర డిజిటల్ పరికరాలు లభ్యమయ్యాయి. ఈ పరికరాల్లో పెద్ద ఎత్తున లావాదేవీల రికార్డులు, యూజర్ వివరాలు, బెట్టింగ్ డేటా దొరికాయి. వీటి ఆధారంగా మొత్తం రాకెట్ ఆర్థిక వ్యవస్థను అధికారులు విశ్లేషిస్తున్నారు.
Betting racket : మాస్టర్‌మైండ్స్ ఎవరు?
అరెస్టయిన ఎనిమిది మంది ప్రధానంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించినట్టు ప్రాథమిక విచారణ (Preliminary investigations)లో తేలింది. కానీ ఈ మొత్తం వ్యవస్థను నడుపుతున్న మాస్టర్‌మైండ్స్ విదేశాల్లో ఉన్నారని (international links) సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. విదేశాల నుంచి యాప్‌లను అభివృద్ధి చేసి, లావాదేవీలను వారు నడుతున్నారని అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్‌కు అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉండే అవకాశముందని, వాటిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
హెచ్చరికలు జారీ చేసిన సీఐడీ
ప్రజలకు సీఐడీ స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది. ఈజీగా డబ్బు సంపాదించొచ్చనే దురాశతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులు కావద్దని సూచిస్తోంది. ఈ యాప్‌లు మోసపూరితమైనవని, వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొంది. వీటిని వాడడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు చట్టపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించింది.
ఏదైనా అనుమానాస్పద యాప్‌లు లేదా లావాదేవీలు గమనిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    