Open Education for Police : సమాజంలో పోలీసులకు ఉన్నత స్థానం ఉంది. ప్రజల రక్షణ, శాంతి భద్రతలను కాపాడడం, నేరాలను అరికట్టడంలో వీరే కీలకం. ఈ క్రమంలో పోలీసు ఉద్యోగ శిక్షణతోపాటు విద్య, నైపుణ్యం మరింత పెరగడం అనేది చాలా ముఖ్యమని భావించింది తెలంగాణ ప్రభుత్వం (Telangana government). దీంతో ఉద్యోగంలో చేరే ముందు డిగ్రీ చదివే అవకాశం పొందలేకపోయిన వారికి ఓ సువర్ణావకాశం (Golden Chance) కల్పించనుంది. ఇందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Dr. B.R. Ambedkar Open University)తో ఒప్పందం కుదుర్చుకుంది.
చదువుకోలేని వారికి సువర్ణవకాశం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ ఉద్యోగులకు, చదువు (education) కొనసాగించాలనుకునే వారికి అనువైన విధంగా కోర్సులు అందిస్తోంది. తాజాగా తెలంగాణ పోలీసులకు ఆ సువర్ణవకాశాన్ని కల్పించనుంది. డిగ్రీ చేయని కానిస్టేబుళ్లు (Constables), ఏఎస్ఐల (Assistant Sub-Inspectors)కు విద్యావకాశం కల్పించనుంది. ఇప్పటి వరకు ఎస్సెస్సీ, ఇంటర్ మాత్రమే పూర్తి చేసిన వారు ఎక్కువ మంది ఈ పోస్టుల్లో ఉండగా వారికి డిగ్రీ చదివే అవకాశం లభించనుంది. అయితే.. 40 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి మాత్రమే ఇది అందుబాటులో రానుంది.
Open Education for Police: సౌకర్యవంత చదువులు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందించే డిగ్రీ కోర్సులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
- సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, క్రిమినాలజీ, సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎకానామిక్స్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదేనీ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు.
- ఫ్లెక్సిబుల్ టైమ్: ఉద్యోగం చేస్తూనే చదువును కొనసాగించొచ్చు. ఎలాంటి ఫిక్స్‌డ్ టైమ్ క్లాసులు ఉండవు. ఆన్‌లైన్, స్టడీ మెటీరియల్స్ ద్వారా సులభంగా చదువుకోవచ్చు.
- పరీక్షా విధానం: ప్రతి సెమిస్టర్‌లోనూ పరీక్షలు ఉంటాయి. వీటిని ముందుగా నిర్ణయించిన సెంటర్లలో నిర్వహిస్తారు.
పోలీసులకు ఎందుకు ముఖ్యం?
చాలామంది చిన్న వయస్సులోనే పోలీసు ఉద్యోగంలో చేరిపోతారు. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు లేదా ఇతర కారణాల వల్ల వారు ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోతారు. ఇదే క్రమంలోనే ఈ రోజుల్లో ఉన్నత విద్య ఒక వ్యక్తి కెరీర్, వ్యక్తిగత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో తక్కువ చదువులు ఉన్న పోలీసులు ఉద్యోగంలో ఉన్నతిని సాధించలేకపోతున్నారు. అలాంటి వారికి అంబేద్కర్ యూనివర్సిటీ చదువులు ఒక వరం లాంటివి.
డిగ్రీ ఉంటే ఏమవుతుంది?
- ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి
- ప్రస్తుత ఉన్న పోస్టు నుంచి ఉన్నత హోదాల్లో (higher positions)కి అడుగుపెట్టొచ్చు.
- రిటైర్మెంట్ తర్వాత కూడా ఇతర రంగాల్లో కూడా పని చేసే అవకాశాలు పెరుగుతాయి.
- వ్యక్తిగత జీవితం ఎంతో సంతృప్తికరంగా సాగుతుంది. సమాజంలో గౌరవం, ఆత్మవిశ్వాసం, పరిజ్ఞానం పెరుగుతుంది. Open Education for Police : ఎవరు అర్హులు?
- ప్రస్తుతం పోలీసు శాఖలో కానిస్టేబుల్ లేదా ఏఎస్ఐ హోదాలో పనిచేస్తుండాలి.
- వయసు 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
- SSC లేదా ఇంటర్ పూర్తిచేసి ఉండాలి.
- ఉన్నత విద్యపై ఆసక్తి, నేర్చుకోవాలనే ఉత్సాహం కలిగి ఉండాలి
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    