కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 23 మంది మావోయిస్టుల హతం..?
Operation Kagar in Chhattisgarh | పహల్గామ్ దాడి (Pahelgam)కి ప్రతీకారంగా భారత ఆర్మీ ఒకవైపు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి ఉగ్రవాదులకు వణుకు పట్టించగా మరోవైపు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల భరతం పడుతోంది. తాజాగా తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. వివరాలు.. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో గత రెండు వారాల పైగా వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల వేటను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తాజాగా బుధవారం ఉదయం Chhattisgarh లోని కర్రెగుట్ట (Karregutta) ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు 23 మంది మావోయిస్టులు నేలకొరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆపరేషన్ “కగార్” (Operation Kagar) స్వల్ప విరామం తర్వాత తీవ్ర రూపం దాల్చింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.