Operation Sindoor Live | రాజౌరి, పూంచ్, జమ్మూ జిల్లాల్లో శనివారం ఉదయం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి సహా ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఉత్తర కాశ్మీర్ (North Kashimir)లోని ఉరి నుంచి జమ్మూ ప్రాంతంలోని రాజౌరి(Rajouri), పూంచ్ (Punch) వరకు నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ దళాలు రాత్రిపూట మోర్టార్, ఆర్టిలరీ షెల్స్‌ను ప్రయోగించాయి. పాకిస్తాన్ (Pakistan) దళాల కాల్పుల్లో అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజౌరిగా ఉన్న ఉన్నతాధికారి రాజ్ కుమార్ తప్పా మరణించారు. ఒక షెల్ అతని ఇంటికి తగలడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందతూ అతడు మరణించాడు.
ఈ విషయమై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా Xలో పోస్ట్ చేశారు. “రాజౌరి నుంచి చేదు వార్త మేము J&K అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌కు చెందిన అంకితభావంతో పనిచేసే అధికారిని కోల్పోయాం. నిన్ననే ఆయన డిప్యూటీ సీఎంతో కలిసి జిల్లాలో పర్యటించారు. నేను నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈరోజు ఆ అధికారి నివాసంపై పాక్ కాల్పులు జరిగాయి, వారు రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని మా అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ శ్రీ రాజ్ కుమార్ ను చంపారు. ఈ దారుణం చూసి షాక్ అయ్యాను. నాకు మాటలు రావడం లేదు” అని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా Xలో పోస్ట్ చేశారు.
అతని మరణంతో, జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 17 కి పెరిగింది. పాకిస్తాన్ దళాలు రాత్రిపూట జరిపిన షెల్లింగ్‌లో రాజౌరి, పూంచ్ ఉరిలోని అనేక నివాస గృహాలు మరియు ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయి.
Operation Sindoor Live : అయితే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేయడానికి భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ దళాలు ఎల్‌ఓసి, జమ్మూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద జనావాసాల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం పిరికిపంద చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.