Operation Sindoor : జమ్మూ కాశ్మీర్: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ చేపట్టిన సైనిక చర్య అయిన ఆపరేషన్ సిందూర్ తరువాత దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అంతటా స్థానికులు భారత ఆర్మీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) లో 26 మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), లష్కరే-ఎ-తోయిబా (ఎల్‌ఇటి) నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న తొమ్మిది కీలక ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.
ఒక స్థానిక నివాసి, ANI తో మాట్లాడుతూ “మేము చాలా సంతోషంగా ఉన్నాము. పాకిస్తాన్‌కు భారతదేశం ఇచ్చే సమాధానం కోసం మేమందరం ఎదురుచూస్తున్నాం. ఈ దాడి రుజువు అయింది. ఈసారి ఎవరూ ఎటువంటి రుజువు అడగబోరు. మేము సైన్యంతో నిలబడతాము.” అని పేర్కొన్నారు.
మహారాష్ట్ర నుండి అనేక మంది పర్యాటకులు మరణించిన పహల్గామ్ దాడి తరువాత, దేశవ్యాప్తంగా బలమైన ప్రతీకార చర్య కోసం డిమాండ్లు పెరిగాయి. ఈ క్రమంలో భారత ఆర్మీకి ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్‌లోని ప్రజలు, సైనిక శిబిరాలకు ముప్పు వాటిల్లకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను (Terrorist camps ) మాత్రమే లక్ష్యంగా భారత ఆర్మీ వైమానికి దాడులు జరిపింది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాత్రిపూట ఆపరేషన్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అత్యంత ఖచ్చితత్వంతో, నిఘా మద్దతుతో దాడులు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
#WATCH | Jammu and Kashmir: Locals raise slogans of 'Indian Army Zindabad' and 'Bharat Mata ki Jai' as the Indian Armed Forces launched ‘Operation Sindoor’, hitting terrorist infrastructure in Pakistan and Pakistan-occupied Jammu and Kashmir from where terrorist attacks against… pic.twitter.com/cbhO6YrToB
— ANI (@ANI) May 7, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.