Operation Sindoor : భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా, ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ దుస్సాహసానికి తగిన విధంగా స్పందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయుధ దళాలను ఆదేశించారని తెలిపాయి.
“ఆపరేషన్ సిందూర్ ముగియలేదు, సీమాంతర ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మే 7న దాడుల తర్వాత భారత్ వైఖరి పటిష్టంగా ఉంది. పాకిస్తాన్ కాల్పులు జరిపితే, భారత్ బాంబులు వేస్తుంది. పాకిస్తాన్ ఆగిపోతే, భారత్ ఆగిపోతుంది అని కూడా ఆ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా మాత్రమే మాట్లాడుతుంది, చర్చించడానికి వేరే అంశం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. “సింధూ జలాల ఒప్పందం సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించినది. భారత్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాదం కొనసాగుతున్నంత కాలం ఈ ఒప్పందం నిలిపివేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని న్యూఢిల్లీ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత కొన్ని రోజుల తర్వాత భారత్ పాకిస్తాన్ శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వొచ్చిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. కానీ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు ఎల్ఓసి వెంబడి షెల్లింగ్, డ్రోన్ దాడులు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
ఆదివారం ఉదయం నాటికి పరిస్థితి అదుపులో ఉందని, ఉద్రిక్త పరిస్థితులు ఆగిపోయాయని అధికారులు తెలిపారు. కానీ సాయుధ దళాలు మాత్రం నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే తగిన విధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.