Pak Provocation : భారతదేశానికి, పాకిస్తాన్ మధ్య (India and Pakistan) సరిహద్దుల్లో ఘధ్య మళ్లీ ఉద్రిక్తత వాతావరణం చోటుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది (Violating the ceasefire agreement repeatedly). వరుసగా నాలుగో రోజు కూడా ఇండియా సరిహద్దులో కాల్పులు జరిపింది. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ జిల్లాల దగ్గర ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ (Line of Control (LOC) వెంబడి పాకిస్తాన్ సైన్యం ఆదివారం అర్ధరాత్రి కాల్పులకు (Pakistani army engaged in firing) తెగబడింది. దీనిపై భారత సైన్యం వెంటనే స్పందించింది. ప్రతీగా ఎదురు కాల్పులకు దిగింది.
Pak Provocation : తిప్పికొట్టిన భారత్
కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్, పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌లో ఈ రెండు ప్రాంతాల్లో ఎల్‌ఓసీ దగ్గర పాకిస్తాన్ సైన్యం చిన్న తుపాకులతో పాటు ఆటోమేటిక్ రైఫిళ్లతో కాల్పులు జరిపింది. భారత సైన్యం వెంటనే స్పందించి ఆ దాడులను గట్టిగా తిప్పికొట్టింది. వాళ్లు భారత సైనిక పోస్టులను గురిపెట్టి కాల్చినా, మన సైనికులు చాలా జాగ్రత్తగా ఉండి పాకిస్తాన్‌ను ఎదుర్కొన్నారు.
పహల్గాం దాడి తర్వాత ఉద్రిక్తత
ఈ నెల 22న జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని పహల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పులు ఆపాలని చేసుకున్న ఒప్పందాన్ని ఆ దేశ సైన్యం పదేపదే ఉల్లంఘిస్తోంది.
భారత్‌ను వీడిన పాకిస్తానీలు
పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రజలందరూ (Pakistani citizens) దేశం విడిచి వెళ్లిపోవాలని ఒక చివరి తేదీ పెట్టింది. అది ఆదివారం (ఏప్రిల్ 27) తో ముగిసింది. దీంతో 537 మంది పాకిస్తాన్ పౌరులు, అధికారులు (Pakistani diplomats) అటారీ-వాఘా బోర్డర్ ద్వారా ఆ దేశానికి వెళ్లిపోయారు. అలాగే ఇండియాకు చెందిన 14 మంది అధికారులు, 850 మంది పౌరులు అటారీ-వాఘా బోర్డర్ ద్వారా స్వదేశానికి చేరుకున్నారని తెలిసింది.
అలాగే తెలంగాణలో ఇప్పుడు 208 మంది పాకిస్తాన్ ప్రజలు ఉన్నారని డీజీపీ జితేందర్ చెప్పారు. వాళ్లలో
156 మందికి ఎక్కువ కాలం ఉండే వీసాలు ఉన్నాయి. 13 మంది తక్కువ కాలం ఉండే వీసాలు కలిగి ఉన్నారు. 39 మంది టూరిస్ట్, మెడికల్, బిజినెస్ వీసాలపై ఇండియాకు వచ్చారని ఆయన చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    