Pakistani illegal entry : పాకిస్తాన్ పౌరుడు (Pakistani man) మొహమ్మద్ ఫయాజ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ (detained) చేశారు. నేపాల్ మీదుగా (via Nepal) అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన (illegal entry) అతడు స్థానిక యువతిని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. తాను దుబాయ్‌లో పనిచేస్తున్నట్లు ఫయాజ్ చెబుతుండగా సరైన వీసా (official permit) లేకుండానే నేపాల్ ద్వారా భారత్‌లోకి అతడు అక్రమంగా ప్రవేశించాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం లభించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Pakistani illegal entry : మూడేళ్ల క్రితమే వచ్చి…
ఫయాజ్ 2022లోనే హైదరాబాద్ (Hyderabad)కు వచ్చాడు. భారత్‌కు నేపాల్ మీదుగా అక్రమంగా ప్రవేశించి ఇక్కడి యువతిని అతడు పెళ్లి చేసుకున్నాడు. నకిలీ ఐడెంటిటీతో ఇక్కడ నివాసం ఏర్పర్చుకున్నాడు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాడని తెలుస్తోంది. ఇందుకు అతడి అత్తింటి వారు సహకరించారు.
అసలు ఉద్దేశం ఏమిటి?
ఫయాజ్ అక్రమ వలసపై అతడి సన్నిహితులే పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిసింది. భారత్‌లో పాకిస్తానీల అక్రమ వలస (illegal entry) కారణంగా అనర్థాల దృష్ట్యా వారు ఇలా స్పందించినట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్‌ను, అతడికి సహకరించిన అత్తింటి వారిని అరెస్టు చేశారు. ఫయాజ్ నిజంగానే పెళ్లి కోసం వచ్చాడా.. లేక ఇంకెవరి తరఫున వచ్చాడా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీసా లేకుండా అతడు ఇలా అక్రమంగా రావడాన్ని చూస్తే ఇది అనుమానాస్పదమేనని భావిస్తున్నారు. స్థానిక కుటుంబానికి, ఫయాజ్‌ను పెళ్లాడిన యువతికి అతడి అసలు ఉద్దేశం తెలుసా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ పోలీసుల కఠిన చర్యలు
జమ్మూ కశ్మీర్ పహల్గాం (Pahalgam)లో ఉగ్రదాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home ministry) కోరింది. దీనిపై తెలంగాణ పోలీసులు స్పందించారు. హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీ పౌరులను గుర్తించారు. వారి వీసాల రద్దుకు ఏప్రిల్ 27 వరకు గడువు విధించారు. వైద్య వీసాలతో ఉన్నవారు ఏప్రిల్ 29లోగా ఇండియా విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.