- 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం
- సర్పంచ్ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
- గ్రామాల్లో మొదలు కానున్న సందడి
- సంతానం నిబంధన ఎత్తివేతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర పోటీ
Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు (Telangana Govt) తీవ్ర కసరత్తు చేస్తోంది. నూతన సంవత్సరంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2025 ఫిబ్రవరి లోనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి అనంతరం జడ్పిటిసీ, ఎంపిటిసి ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను ఒకేరోజు జరిపితే ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయమని ముందుగానే గుర్తించిన ఎన్నికల సంఘం.. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. సర్పంచ్ ఎన్నికలు (Panchayat Elections) ముగిసిన అనంతరం జడ్పీటీసీ(ZPTC), ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు పిల్లలకు మించి సంతానం కలిగి ఉంటే పోటీకి అనర్హులు కానీ ఆ నిబంధనను ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపైనా కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సర్పంచ్ ల పదవీ కాలం పూర్తయి 10 నెలలు గడుస్తుండడంతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం..
సర్పంచ్ ఎన్నికల అనంతరం జడ్పిటిసీ, ఎంపిటిసి…
Panchayat Elections : రాష్ట్రవ్యాప్తంగా 538 జెడ్పీటీసీ స్థానాలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు (MPTC Elections) ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జూలై లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసింది. 2025 ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ గుర్తులు ఉండవు కానీ జడ్పిటిసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి.కొన్నిచోట్ల అల్లర్లు జరిగే ప్రమాదం లేకపోలేదు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం సిబ్బందిని ఏర్పరుచుకోవాలి కాబట్టి సర్పంచ్ ఎన్నికల తర్వాతే జడ్పిటిసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.నిబంధనల ప్రకారం ఒక మండలం లో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండాలి కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో కొన్ని కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది .దానికి అనుగుణంగానే నూతనంగా ఏర్పడిన మండలాల్లో ఎంపిటిసి స్థానాలు పెంచాల్సి ఉంటుంది కాబట్టి దీనిపై చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Also Read : Dharani Portal | ధరణి ధరఖాస్తులకు ఇకపై త్వరలో పరిష్కారం.. కొత్త మార్గదర్శకాలు ఇవే..
1 Comment
[…] ఒకేసారి నిర్వహించాలని, సాధారణ ఎన్నికల తర్వాత 100 రోజులలోపు స్థానిక సంస్థల […]