Parliament erupts | విపక్షాలు (INDIA), ఎన్డీఏ (NDA) ఎంపీల మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో ఈ రోజు ఘర్షణ జరిగింది. తోపులాట, పెనుగులాటలతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడ్డారు. దీంతో ఆయన్ను ఆ పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు. సారంగిని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తోసేసారని, దీంతో ఆయన కిందపడిపోయి గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది.
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
అంబేడ్కర్ అంశంపై పార్లమెంటు సాక్షిగా నిరసనలు జరుగుతున్నాయి. అంబేద్కర్‌ను హోంమంత్రి అమిత్ షా అవమానించారని విపక్షాలు ఆరోపిస్తూ పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు చేపడుతున్నాయి. ఇదే క్రమంలోనే ఈ రోజు సేషన్ ప్రారంభానికి ముందుకు పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు, బీజేపీ ఎంపీల మధ్య గొడవ జరిగింది. తోపులాటలు, పెనుగులాటలతో ఆ ప్రాంగణం హోరెత్తింది. తాను పార్లమెంట్ హౌస్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా బీజేపీ సభ్యులు తనను బయటకు తోసి బెదిరించారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ‘ఇది పార్లమెంట్ ప్రవేశద్వారం. అందులోకి వెళ్లడం మా హక్కు. కానీ బీజేపీ సభ్యులు అడ్డుపడుతున్నారు’ అన్నారు. మరోవైపు బీజేపీ నేత నిశికాంత్ దుబే మాట్లాడుతూ తమ పార్టీ ఎంపీని రాహుల్ గాంధీ తోసేసారని, దీంతో ఆయన కిందపడ్డారని ఆరోపించారు. కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ తోసివేయడంతో సారంగి కిందపడిపోయారని, దీంతో ఆయన నుదిటికి గాయమై కుట్లు వేయాల్సి వచ్చిందని తెలిపారు.
ఎలా మొదలైందంటే..
Parliament erupts : పార్లమెంట్ ప్రాంగణంలో అంబేద్కర్ (B R Ambedkar) విగ్రహం వద్ద ఐఎన్డీఐఏ (ఇండియా) బ్లాక్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. అమిత్‌షా రాజినామా చేయాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు నిరసనకు దిగారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎంపీలే అవమానిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. పార్లమెంట్ సేషన్ ప్రారంభం కానుండగా హౌస్‌లోకి ఎంపీలు ప్రవేశిస్తున్న క్రమంలో తోపులాట చోటుచేసుకొని ఉద్రిక్తతకు దారి తీసింది.
దేశవ్యాప్తంగా నిరసనలు
హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలు ముమ్మరం చేశాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆర్జేడీ తదితర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటులోనే కాకుండా దేశ రాజధాని రోడ్లపై, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ నిరసనలు ఉధృతమయ్యాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు.
After Rahul Gandhi shoved and pushed, causing injury to BJP MP PC Sarangi:@nishikant_dubey : ‘Aren’t you ashamed Rahul? You are doing gundagardi.’@RahulGandhi : ‘He (Sarangi) pushed me.’
Among the many privileges of the privileged Nehru Dynasty, is the privilege to tell lies. pic.twitter.com/8uWdIweSnF
— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) December 19, 2024
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..