Harihara Veeramallu Trailer release | ఇటు సినిమాలు, అటు రాజకీయాల్లో సంచలనం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇది అభిమానులకు సంతోషానిచ్చినా.. ఆయను తెరపై చూడలేమని మదనపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఇదివరకే కమిటైన సినిమాలను ఒక్కొక్కోటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా హరిహర వీరమల్లు షూటింగ్‌ను ఎంత బిజీగా ఉన్నా శ్రమించి ఎట్టకేలకు పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈ రోజే రిలీజ్ చేసింది.. ట్రైలర్ ఎలా ఉంది? పవన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అభిమానులను అలరించిందా? లేదా అన్నది ఇపుడు పరిశీలిద్దాం..
హరిహర వీరమల్లు మూవీ (Harihara Veeramallu Movie )ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పూర్తిచేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్ ఓ ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిశారు. ఇక బాబీ డియోల్ (Bobby Deol), ఫర్గీస్ నక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్. జిషుసేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్, విక్రమ్‌జిత్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) మూజిక్ అందిస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్, మనోజ్ పరమహంసలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. క్రిష్ జాగర్లమూడి తొలుత ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించగా.. టేకప్ చేయగా అనివార్య కారణాలతో ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ డైరెక్షన్ పగ్గాలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్‌స్టార్‌తో, అందులోనూ టైట్ షెడ్యూల్ మధ్య జ్యోతికృష్ణ సమన్వయం చేసుకుని సినిమాను పూర్తి చేశారు.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ జూలై 3న ఉదయం 11.10 గంటలకు హరిహర వీరమల్లు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ట్రైలర్ స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పవన్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.
Harihara Veeramallu ట్రైలర్ ఎలా ఉంది.?
‘ది బెస్ట్ ట్రైలర్ కట్’ అంటూ మేకర్స్ ఇచ్చిన హైప్‌కు తగ్గట్టే, అర్జున్ దాస్ శక్తివంతమైన వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ఈ ట్రైలర్, విజువల్స్, యాక్షన్ బ్లాక్స్, ఎలివేషన్స్ అన్నింటికీ బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది. పవన్ కల్యాణ్ ను ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని లుక్‌లో చూపించడమే కాకుండా, ఆయనపై తీసిన యాక్షన్ సీన్లు నిజంగా విధ్వంసమనినిపించేలా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌లో ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్ goosebumps రేపేలా ఉన్నాయి.
ఇక బాబీ డియోల్ ఔరంగజేబుగా వదిలిన ఇంపాక్ట్ అద్భుతం. విలన్ క్యారెక్టర్‌లో ఆయన చేసిన మేకోవర్ హైలైట్‌గా నిలుస్తుందని స్పష్టమవుతోంది. నిధి అగర్వాల్ (Nidhhi Aggarwal) ట్రైలర్‌లో గ్లామర్, ఎమోషన్ రెండింటినీ సమపాళ్లలో చూపిస్తూ మెరిసింది. పవన్‌తో ఉన్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌లో సాగుతున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్పెషల్‌గా వినిపించిన ఓ పాట… చివరన వొచ్చే క్రేజీ విజువల్స్ అన్నీ కలిపి, ఇది గ్రాండ్ విజువల్ అండ్ యాక్షన్ ట్రీట్ అనేలా చూపించాయి. మొత్తానికి ట్రైలర్ చూసి అభిమానులు హుషారెత్తిపోతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.