Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ జూన్ 12న రిలీజ్‌కి రెడీ అయింది. అయితే ఇదే సమయంలో తమ డిమాండ్ల సాధన కోసం సినిమా థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబ్యూటర్లు నిర్మాతలను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవర్‌స్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారా ? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా పరిశ్రమలను ఎలా చూసిందో, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిందో మరిచిపోయారా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిలదీశారు.
ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిప్ట్ట్స్‌కి కృతజ్ఞతలు అంటూ పవన్ కల్యాణ్ కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటనను విడుదల చేసింది . అయితే పవన్ ప్రకటన వచ్చిన వెంటనే టాలీవుడ్ ప్రముఖులు బన్నీ వాసు స్పందించారు. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే.. మన యూనిటీ ఎలా ఉందని ప్రశ్నించుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత నాగవంశీ స్పందిస్తూ… కీలకమైన సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో అనవసరంగా కొత్త సమస్యలు సృష్టించారని, ఇప్పుడు అవే పెద్ద సమస్యలుగా మారాయన్నారు. సమయస్ఫూర్తితో ఆలోచించి ఉంటే ఎలాంటి సమస్య వచ్చి ఉండేది కాదని అన్నారు.
ఇదిలా ఉండగా ఏపీలో థియేటర్ల బంద్ అనేది కేవలం ఊహాగానాలు మాత్రమేనని, జూన్ 1న థియేటర్ల బంద్ లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ తాజాగా ప్రకటించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








