ఓజీ (OG) మూవీ కోసం వరల్డ్ వైడ్ పవన్ కల్యాణ్ (power Star Pawan Kalyan)ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. పూర్తి స్థాయి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోయే ఈ మూవీ ఈనెల 25న(25th September)గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.ఈ మూవీపై ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఓజీ గెటప్ లోనే వచ్చి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు.
స్టేజ్ పై వాషి ఓ వాషి సాంగ్ పాడి జోష్ తెచ్చారు. OG ట్రైలర్ రెడీ గా లేనందున రిలీజ్ చేయననుకున్నారు. కానీ పవన్ తన ఫ్యాన్స్ డిజప్పాయింట్ కావొద్దని రెడీ గా లేకున్న అలాగే చూపెట్టారు. ఇక పూర్తి క్లారిటీ ట్రైలర్ ను లేటెస్ట్ గా మూవీ టీం రిలీజ్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా అదరగొట్టారు. బ్లాస్ట్ లు, ఫైరింగ్ తో ట్రైలర్ ను వేరే లెవెల్ లో కట్ చేసారు.పుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా అలరించనుంది.
ఈ మధ్య పవన్ సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకోవట్లేదు. కానీ ఈ మూవీ వింటేజ్ పవన్ ను గుర్తు చేసేలా హిట్టయ్యేలా ఉంది. వాడి ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే…అని శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ తో మూవీ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది.
బాంబే వస్తున్న…తలలు జాగ్రత్త….. పవర్ ఫుల్ డైలాగ్…
ఒక పవర్ ఫుల్ విలన్ గా హిమ్రాన్ హష్మీ (himran hashmi) స్టైలిష్ గా కనిపించారు. నిన్ను చూడాలని కొందరు…కలవాలని ఇంకొందరు..చంపాలని అందరు ఎదురు చూస్తున్నారు అని బేస్ వాయిస్ తో వచ్చే డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ అని చెప్పొచ్చు. ఇక పవన్ చెప్పిన బాంబే వస్తున్న తలలు జాగ్రత్త అనే డైలాగ్ థియేటర్లు బ్లాస్ట్ కావడం ఖాయం.
OG : తమన్ బీజీఎం అరాచకం..
ట్రైలర్ లో ఇంకా చెప్పుకోవాల్సింది తమన్ బీజీఎం. అరాచకమైన తన బీజీఎంతో ట్రైలర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. రిలీజ్ రోజు థియేటర్ల లో ఫ్యాన్స్ అల్లరి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. లాస్ట్ లో పవన్ పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. మొత్తానికి డైరెక్టర్ సుజీత్ పవర్ స్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కి చెప్పబోతున్నాడనిపించింది. డీవీవీ దానయ్య ఖర్చుకు ఏ మాత్రం తగ్గకుండా తీశారని షాట్స్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ తో అదరగొట్టిన ఓజీ ఈ నెల 25 న ఏ రేంజ్ లో దుమ్ము దులుపుతుందో చూడాలి…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    