TG Assembly | రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది. ఈ మేరకు శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలనే ఉద్దేశంతోనే రేవంత్ సర్కారు ఈ చర్యలు చేపట్టిందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ ఆవరణలో ఎవరైనా, ఎప్పుడైనా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు చాన్స్ ఉండేది. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పేవారు కాదు. అయితే శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీవీ ఛానెల్స్ లైవ్ ఇవ్వొద్దని మాత్రం చెప్పేవారని.. ఫొటోలు, వీడియోల షూటింగ్‌లపై ఆంక్షలు లేవని పలువరు గుర్తు చేస్తున్నారు. తాజా రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కొత్త నిబంధనలను తీసుకువొచ్చింది. ప్రజా పాలన అంటూ ఎక్కడికక్కడ.. నిర్బంధాలను విధిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా ఎక్స్(ట్విట్టర్) లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..