PM Modi Kuwait Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్‌కు చేరుకున్నారు. రెండు రోజులపాటు ఆయన ఈ దేశంలో పర్యటించనున్నారు. మోదీ పర్యటన చారిత్రకంగా నిలిచింది. 43 సంవత్సరాల తర్వాత గల్ఫ్ దేశానికి భారత ప్రధాని చేయబోయే తొలి పర్యటన ఇది. కువైట్ రాజు షేక్ మేశాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడి వెళ్తున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య పెరుగుతున్న సత్సంబంధాలకు ప్రతీక అని విశ్లేషకులు అంటున్నారు. భారత్, కువైట్‌కు ప్రయోజనకరంగా నిలవనుందని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
కువైట్‌తో బలమైన వాణిజ్య సంబంధాలు
భారత్, కువైట్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా శక్తి రంగంలో భారతదేశానికి కువైట్ అగ్ర వ్యాపార భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 10.47 బిలియన్ డాలర్లకు చేరుకుంది. Modi In Kuwait
భారతదేశం, కువైట్ మధ్య చారిత్రాత్మకంగా సన్నిహిత , స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఇవి ఆర్థిక సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధాలతో బలపడినవి. కువైట్‌కు భారతదేశం ప్రధాన వ్యాపార భాగస్వామి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది.
ఘన స్వాగతం
మోదీ కువైట్ చేరుకున్న తర్వాత బయాన్ ప్యాలెస్ వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడి భద్రత బలగాల నుంచి గౌరవందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. ఈ పర్యటనలో భాగంగా కువైట్ రాజుతోపాటు క్రౌన్ ప్రిన్స్ షేక్ సబాహ్ అల్ ఖలిద్ అల్ సబాహ్, కువైట్ ప్రధాన మంత్రితో పలు కీలక అంశాలపై మోదీకి ఉన్నతస్థాయి చర్చలు జరగనున్నాయి.
కార్మిక శిబిరం సందర్శన
PM Kuwait Visit తన పర్యటనలో భాగంగా మోదీ భారతీయ కార్మిక శిబరాన్ని సందర్శిస్తారు. అక్కడ భారతీయ కార్మికులను నేరుగా కలుసుకుంటారు. భారతీయలుగా వారు చేస్తున్న సేవలను ప్రధాని అభినందిస్తారు. దీంతో వారి పట్ల మన ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, ఆత్మీయతను కనబర్చడమే మోదీ ముఖ్యోద్దేశం విదేశాంగ శాఖ తెలిపింది. తద్వారా కువైట్‌లోని భారతీయుల్లో ఆత్మవిశ్వసం పెరుగుతుందని ప్రధాని భావిస్తున్నారని తెలుస్తోంది.
ప్రవాసులతో సమావేశం
కువైట్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులతో మోదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారతీయుల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. సంస్కృతిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే పలు ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. కువైట్‌లో అత్యధికంగా భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు.
కువైట్‌లో భారతీయ ప్రవాసులను మోదీ కలుసుకోవడంతో రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు మరింత బలపడనున్నట్టు తెలుస్తోంది.
గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం
తన పర్యటనలో రెండో రోజు ప్రధాని మోదీ గల్ఫ్ కప్ క్రీడోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కువైట్, భారతదేశం మధ్య సంస్కృతిక అనుబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
ప్రధాని మోదీ పర్యటన చారిత్రకం కానుంది. 1981లో భారత మాజీ ప్రధాని ఇంద్రా గాంధీ పర్యటన తర్వాత కువైట్‌ను సందర్శిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ అరుణ్ కుమార్ చటర్జీ తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..