Ponguleti Srinivas Reddy : సంక్రాంతి పండుగ పూట తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద జరిగింది. అయితే కారు డ్రైవర్ ఆ క్షణంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
కాగా టైర్లు పేలిపోవడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. అయితే డ్రైవర్ పరస్థితిని అదుపులోకి తేవడంతో మంత్రితో పాటుగా కారులో ఉన్న ఇతరులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ప్రమాద సమయంలో కారులో మంత్రితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. కాగా ప్రమాదం జరిగిన తర్వాత ఆ కారును అక్కడే వదిలి తన ఎస్కార్ట్ వాహనంలో మంత్రి పొంగులేటి ఖమ్మం నగరానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..