Sarkar Live

Pope Francis | పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు.. కేథ‌లిక్ మ‌త‌స్తుల్లో విషాదం

Pope Francis Passes Away : రోమన్ కాథలిక్ (Roman Catholic) ప్రధాన పురోహితుడు పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఇకలేరు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న 88 ఏళ్ల వ‌య‌సులో క‌నుమూశారు. వాటికన్ సిటీలోని తన నివాసమైన కాసా సాంటా మార్టా

Pope Francis

Pope Francis Passes Away : రోమన్ కాథలిక్ (Roman Catholic) ప్రధాన పురోహితుడు పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఇకలేరు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న 88 ఏళ్ల వ‌య‌సులో క‌నుమూశారు. వాటికన్ సిటీలోని తన నివాసమైన కాసా సాంటా మార్టా (Casa Santa Marta) లో ఇవాళ తుది శ్వాస విడిచారు. వాటికన్ సిటీ అధికారులు (Vatican authorities) ఈ మేర‌కు ప్రకటించారు.

Pope Francis Passes : జీవిత నేప‌థ్యం ఇదీ..

పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబరు 17న అర్జెంటీనాలో పుట్టారు. ఆయ‌న అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో (Jorge Mario Bergoglio). విద్య, తత్వశాస్త్రం, ధార్మిక పాఠ్యాంశాల‌ అధ్యయనం అనంతరం మతపరంగా సేవలు ప్రారంభించారు. 2013 మార్చి 13న పోప్ బెనెడిక్ట్ (Pope Benedict) XVI రాజీనామా చేసిన అనంతరం పోప్ ఫ్రాన్సిస్ 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి పోప్‌గా నియమితులైన తొలి వ్యక్తి (first Pope from the American continent)గా చరిత్రలో నిలిచారు.

పోప్‌గా 12 ఏళ్ల సేవ‌లు

పోప్ ఫ్రాన్సిస్ తన పదవిలో 12 ఏళ్ల‌పాటు సేవలందించారు. ఆధునిక ప్రపంచంలో మతసామరస్యం, పేదల సంక్షేమం, వలసదారుల సమస్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విశేషంగా దృష్టి పెట్టారు. అంతర్జాతీయంగా సత్కారాలు అందుకున్న ఆయన కేథలిక్ మతాన్ని ప్రజలకి మరింత చేరువ చేశారు.

ఈస్ట‌ర్ వేడుక‌ల్లో పాల్గొని..

కొన్ని సంవత్సరాలుగా పోప్ ఫ్రాన్సిస్ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్ర అనారోగ్యం కారణంగా రోమ్‌లోని ఆస్ప‌త్రిలో చేరారు. దాదాపు రెండు నెలలపాటు అక్కడే చికిత్స తీసుకున్నారు. దీంతో కాస్త ఆరోగ్యం కుదుటపడింది. నిన్నటి వరకు ఆయన ఈస్టర్ వేడుకల్లో (Easter Celebrations) పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ఇవాళ ఉదయం వాటికన్ నివాసంలో తన తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తను అధికారికంగా ప్రకటించిన వాటికన్ అధికారులు, ఇది కేథలిక్ ప్రపంచానికి తీరని లోటని తెలిపారు.

Pope Francis : ప్రపంచమంతటా దిగ్భ్రాంతి

పోప్ ఫ్రాన్సిస్ మరణం (Pope Francis )తో కేథలిక్ మ‌త‌స్తులే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల వారూ దిగ్భ్రాంతికి లోన‌య్యారు. ప‌లుచోట్ల మ‌తాల‌కు అతీతంగా నివాళులు అర్పించారు. ప్రజల హృదయాల్లో పోప్ ఫ్రాన్సిస్‌ ఎప్పటికీ నిలిచిపోతారంటూ సోషల్ మీడియా వేదికగా అనేక మంది సంతాపం తెలిపారు. వాటికన్ సిటీలో అధికారికంగా శ్రద్ధాంజలి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వచ్చే కొన్ని రోజుల పాటు అంత్యక్రియల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.

మానవత్వానికి మార్గదర్శకుడిగా

పోప్ ఫ్రాన్సిస్ మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా మానవత్వం గురించి బోధించారు. కేథలిక్ విశ్వాసాల పరిరక్షణతో పాటు హేతుబద్ధత, సమానత్వం, క్షమ, ప్రేమ వంటి విలువల్ని ప్రతిష్ఠించారు. మతపరమైన విధానాల్లో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఆయనను ఆధునిక పోప్‌గా గుర్తింపు పొందారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!