Post Office Recruitment 2025 : భారతీయ తపాలా శాఖ (India Post) మరో నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak (GDS)) పోస్టులను నియమించనున్నట్టు ప్రకటించింది. భారతదేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఉన్న 2,1413 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలిపింది.
నియమించనున్న ఉద్యోగాలు ఇవే..
ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM), డాక్ సేవక్ ఉద్యోగాల్లో పోస్టల్ శాఖ నియామకాలు చేపట్టనుంది. ఇందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నియామకాలకు ఎలాంటి పరీక్ష ఉండదు. మెరిట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకొని నేరుగా ఉద్యోగావకాశం కల్పిస్తారు.
Post Office Recruitment కు విద్యార్హతలు
గ్రామీణ డాక్ సేవక్ GDS నియామకానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాస్ అయ్యుండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకుంటున్న పోస్టల్ సర్కిల్‌కు సంబంధించిన స్థానిక భాషలో కనీసం పదో తరగతి వరకు చదివి ఉండాలి.
- బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అసిస్టెంట్ పోస్టుమాస్టర్ (ABPM) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారు అదనంగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ తెలిసి ఉండాలి. సైక్లింగ్ పరిజ్ఞానం కూడా తప్పనిసరి.
- డాక్ సేవక్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే వారు ఇతర ఆదాయ వనరులు కలిగి ఉండాలి. ఈ ఒక్క ఉద్యోగమే జీవనాధారం అని కాకుండా ఇతర కార్యకలాపాల ద్వారా ఆదాయం పొందుతూ ఉండాలి.
వయో పరిమితి
- కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 40 సంవత్సరాలు
- వయస్సు సడలింపు:
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
- పీడబ్ల్యూడీ (PwD) అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
- PwD + OBC: 13 సంవత్సరాలు
- PwD + SC/ST: 15 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు:
- సాధారణ/OBC/EWS అభ్యర్థులకు: రూ.100/-
- SC/ST/PwD/మహిళా అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు (0)
- అభ్యర్థులు ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.
దరఖాస్తు (ఆన్‌లైన్ ) ప్రారంభ తేదీ: 10 ఫిబ్రవరి 2025
- చివరి తేదీ: 3 మార్చి 2025
- దరఖాస్తును సవరించుకొనేందుకు (కరెక్షన్) గడువు: 6 మార్చి – 8 మార్చి 2025
ఎంపిక విధానం:
- GDS నియామకం పూర్తిగా మెరిట్ (Post Office Recruitment) ఆధారంగా జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించబడదు. పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను విడుదల చేస్తారు. పదో తరగతి కన్నా ఎక్కువ విద్యార్హత ఉన్నా పరిగణనలోకి తీసుకోరు.
- టై వచ్చిన సందర్భంలో ఎక్కువ వయస్సున్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు.
- ఒకే వయస్సు ఉన్న అభ్యర్థులలో కేటగిరీ ఆధారంగా ఎంపిక (SC, ST, OBC, UR మొదలైనవి) విషయంలో టై అయితే మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
- మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ప్రొవిషనల్ అపాయింట్‌మెంట్ లెటర్ జారీ అవుతుంది.
దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్‌సైట్‌కు indiapostgdsonline.gov.inను క్లిక్ చేయండి.
- మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ID నమోదు చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ నింపండి. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కేటగిరీ వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
- స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో (50 KB లోపు) అప్‌లోడ్ చేయాలి.
- స్కాన్ చేసిన సంతకం (20 KB లోపు) అప్‌లోడ్ చేయాలి.
- 10వ తరగతి మార్క్ షీట్ అప్‌లోడ్ చేయాలి.
- కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే) అప్‌లోడ్ చేయాలి.
- దివ్యాంగులైతే ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి.
- ఆ తర్వాత ఫీజు చెల్లించండి (అవసరమైన అభ్యర్థులు మాత్రమే).
- అన్ని సరిచూసుకొని అప్లికేషన్ సమర్పించండి.
- దరఖాస్తు కాపీ ప్రింట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Post Office Recruitment 2025 | పోస్టల్ శాఖలో భారీ నియమకాలు.. టెన్త్ పాసైతే చాలు..”