పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మూవీ హరిహర వీరమల్లు (Harihara Veeramallu). 4 ఏళ్ల క్రితం మొదలైన ఈ మూవీ అన్ని అడ్డంకులను దాటుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ జెట్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటుంది. పవర్ స్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై ఫాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించే ధీరుడు…
మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించే ఒక యోధుడిగా పవన్ విశ్వరూపాన్ని చూపెట్టబోతున్నట్టు మూవీ టీం చెబుతోంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ మూవీని మొదట క్రిష్(krish)డైరెక్ట్ చేశాడు.ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.ఆ బాధ్యతలను ప్రొడ్యూసర్ ఎ ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ (Jyothi Krishna) అందుకుని మూవీని కంప్లీట్ చేశాడు.
జూలై 24న గ్రాండ్ రిలీజ్…
ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్న సీజీ వర్క్ డిలే అవ్వడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి మూవీని జూలై 24న(July 24th) వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీం అనౌన్స్ చేసింది. రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి(MM keeravani) మ్యూజిక్ అందిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన సాంగ్స్ తో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల తర్వాత ఒక సాంగ్ కూడా పాడిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ అన్ని భాషల్లో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. విశేషమేంటంటే అన్ని భాష ల్లో ఈ సాంగ్ పవర్ స్టార్ పాడి మెప్పించాడు. ఆ తర్వాత వచ్చిన సాంగ్స్ కి కూడా ఫాన్స్ ఫిదా అయ్యారు. వీరమల్లు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడనే ధీమాతో ఉన్నారు.
జూలై 3 న థియేట్రికల్ ట్రైలర్…
Power Star Pawan Kalyan team లేటెస్ట్ గా మరో అప్డేట్ తో ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చింది. జూలై 3 న థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చాలా ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు విడుదల అవుతుండడం, పవన్ ను వెండితెరపై చూడబోతున్నాం అనే ఉత్సాహం నెలకొంది. ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసుకుని ఫ్యాన్స్ లో మరింత అంచనాలు పెంచాలని మూవీ టీం చూస్తోంది. బాబీ డియోల్ విలన్ రోల్ లో, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.