Prakriti Malla World’s Most Beautiful Handwriting : జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి విద్య ఒక సాధనం. చేతిరాతకు, చదువుకు మధ్య లోతైన సంబంధం ఉంది. విద్యలో చేతిరాత ఒక ముఖ్యమైన అంశమనేంది కూడా నిజమే.. మంచి చేతిరాత గల విద్యార్థులు తమ జీవితాల్లో పురోగతి సాధిస్తారని చెబుతారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల మంచి చేతిరాతను అభినందిస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక రకమైన ప్రతిభ.. అందరికీ అందమైన హాండ్ రైటింగ్ రాదు.. మంచి చేతి రాతకోసం మీరు ప్రతిరోజూ సాధన చేయాలి. అందువల్ల, మీరు మీ పిల్లలను ప్రతిరోజూ 15-20 నిమిషాలు చేతిరాతను సాధన చేయమని చెప్పాలి. ప్రతీరోజు పిల్లలు సాధన చేయడం వల్ల చేతిరాతలో కచ్చితనమైన మార్పు వస్తుంది.
నేపాల్ (Nepal) కు చెందిన ప్రకృతి మల్లా (Prakriti Malla ) తన చేతిరాతతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె అసాధారణ చేతిరాత ఆమెకు “ప్రపంచంలోని అత్యంత అందమైన చేతిరాత” అనే బిరుదును సంపాదించిపెట్టింది.
ప్రకృతి మల్లా అనే బాలిక 16 సంవత్సరాల వయసులోనే పాపులర్ అయింది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు, ఆమె చేసిన ఒక అసైన్‌మెంట్ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. కాగితంపై చేతిరాత ఎంతగా ఆకట్టుకుందంటే ఇది ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని ప్రశంసలు అందుకుంది.
కంప్యూటర్లు వచ్చినప్పటి నుంచి, ప్రజలు చేతితో రాయడం దాదాపుగా మానేశారు. ఒకప్పుడు చేతిరాతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే రానురాను చేతితో రాసే పనిలేకుండా పోయింది.. అందరూ జిరాక్స్, ప్రింటెడ్ కంటెంట్ నే చదువుతున్నారు. ఈక్రమంలో చాలా తక్కువ మంది మాత్రమే అందంగా రాయగలిగే ప్రతిభను కలిగి ఉన్నారు.
Most Beautiful Handwriting : నేపాల్ విద్యార్థినిపై ప్రశంసలు
ప్రకృతి మల్లా ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత (Most Beautiful Handwriting )ను కలిగి ఉందని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేతిరాత నిపుణులు కూడా ప్రకృతి మల్ల చేతిరాతను చూసి ఆశ్చర్యపోయారు. ప్రకృతి మల్లా చేతిరాతను కాగితంపై చూస్తే అది చేతితో రాసిందా లేక కంప్యూటర్‌లో టైప్ చేసిందా అని చెప్పడం అసాధ్యం అని చాలా మంది నెటిజన్లు అంటున్నారు. 51వ యూనియన్ స్ఫూర్తి సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కు అలాగే పౌరులకు ప్రకృతి అభినందన లేఖ రాశారు. ఆమె స్వయంగా ఆ లేఖను రాయబార కార్యాలయానికి అందజేసింది. ప్రకృతిని నేపాల్ సాయుధ దళాలు కూడా సత్కరించాయి.
Most Beautiful Handwriting Video
A caligrafia considerada mais bonita do mundo é de Prakriti Malla, um garoto de 8 anos de idade do Nepal 🇳🇵 pic.twitter.com/BObIhqPbyh
— Ariel Góes (@cara_zeus) August 26, 2023
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..