Prasanth Varma Next Movie | హనుమాన్ (Hanuman) మూవీతో అన్ని ఇండస్ట్రీల్లో ప్రశాంత్ వర్మ (Prasanth Varma )పేరు మార్మోగి పోయింది. అప్పటి వరకు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో మూవీస్ తీస్తాడనే పేరున్న కూడా హనుమాన్ మూవీతో మాత్రం ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ ని చేసింది.
అతి తక్కువ బడ్జెట్‌లో సినిమా తీసి 400 కోట్లు కొల్లగొట్టి టాప్ డైరెక్టర్ల లో తానూ ఒకడినని నిరూపించుకున్నాడు. ఆ మూవీ వచ్చి ఏడాది దాటిపోయినా మరో మూవీ చేయడానికి టైమ్ తీసుకుంటున్నాడు. తన డైరెక్షన్ లో మూవీ చేయాలని స్టార్ హీరోలు కూడా రెడీగా ఉన్నా ప్రశాంత్ వర్మ మాత్రం ఏ మూవీ చేయాలా అని గందరగోళంలో ఉన్న ట్లు తెలుస్తోంది.
Prasanth Varma హనుమాన్ కు సీక్వెల్
హనుమాన్ మూవీకి సీక్వెల్ జై హనుమాన్ తీస్తానని ఇప్పటికే ప్రకటించాడు. ఈ మూవీలో హనుమాన్ గా రిషభ్ శెట్టి ని కూడా కన్ఫామ్ చేస్తూ పోస్టర్ కూడా వదిలారు. మరొకవైపు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఇక స్టార్ట్ అవుతుందని సంబరపడిన అభిమానులకు సడన్ గా కొన్ని కారణాలవల్ల మూవీ ఆగిపోయిందనే వార్తలు వారికి నిరాశ కలిగించింది. ఇక ఈ మూవీ ఉండకపోవచ్చు అని అనుకుంటూ ఉండగా మూవీ టీమ్ మాత్రం ఇది కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ ఇది ఎప్పుడు మొదలవుతుందో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తన క్రియేటివ్ యూనివ ర్స్ లో భాగంగా మహంకాళి అనే మూవీ ని కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ మూవీకి తన దర్శకత్వం వహించట్లేదు. కథను మాత్రమే అందిస్తున్నాడట. ఇక ప్రశాంత్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా బ్రహ్మ రాక్షస (brahma rakshasa) అనే మూవీని హనుమాన్ తర్వాత తెరకెక్కించాలనుకున్నాడు. రణవీర్ సింగ్ కి కథను కూడా వినిపించాడు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే కథను ప్రభాస్ కి వినిపించాడని ఆ మధ్యలో టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ప్రాజెక్టులోకి రానా పేరు తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు రానా ఒప్పుకున్నాడని త్వరలో మొదలవుతుందనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న అఫీషియల్ గా మాత్రం ప్రశాంత్ వర్మ వెల్లడించలేదు.
హనుమాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ తన దగ్గర ఉన్న కథల్లో ఏ మూవీ ని తెరకెక్కించాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నాడని ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. కానీ కొందరు తన మూవీస్ లైనప్ పై క్లారిటీ గానే ఉన్నాడని, హనుమాన్ మూవీ డైరెక్టర్ గా బాధ్యతను పెంచిందంటున్నారు. జై హనుమాన్ ,మోక్షజ్ఞ మూవీస్ తెరకెక్కించాక తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇకపై ప్రశాంత్ వర్మ ఏ మూవీ తీసిన ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం భారీగా ఉంటాయి అని చెప్పొచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    