Prashanth Neel Next Movie | దేవర (Devara) మూవీ హిట్టు తర్వాత యశ్ రాజ్ ఫిలింస్ (Yash Raj Films Banner) బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) వార్ -2 (War-2)లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా ఒక పాట మినహా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో హృతిక్ ఎన్టీఆర్ కాంబో(Hrithik Roshan – NTR combo) చూడడం కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మూవీని ఆగస్టులో రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వార్ మూవీ ఎంత పెద్ద హిట్టయిందొ మనకు తెలుసు. ఇది అంతకుమించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొదట సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా ఇప్పుడు ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.
భారీ అంచనాలతో…
ఇక ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో ఎన్టీఆర్ (NTR) ఒక మూవీ రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితమే ఈ మూవీ వచ్చేది. కానీ వీరిద్దరూ ఎవరి ప్రాజెక్టు లో వారు బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా వారి మూవీస్ ని ఫినిష్ చేసుకున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చే మూవీ పై ఫాన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మూవీ తెరకెక్కుతుంది. నిన్న రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ప్రారంభం అయింది. 1960 బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కుతుందని తెలుస్తోంది. నిన్న ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఒక స్టిల్ ని కూడా రిలీజ్ చేశారు. మొదటి రోజే ఒక పెద్ద యాక్షన్ సన్నివేశం తోనే మొదలుపెట్టారు. ఈ స్టిల్ ప్రశాంత్ నీల్ అన్ని మూవీస్ తరహాలోనే ఉంది. ఏదో అల్లర్లు జరుగుతున్న సీన్ ని షూట్ చేసినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ మూవీస్ స్టైల్ లోనే ఇది కూడా బ్లాక్ కలర్ లోనే ఉంది.
Prashanth Neel New Project : పాత టీమ్ తోనే ముందుకు..
మూవీకి ప్రశాంత్ నీల్ తన పాత టీమ్ తోనే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ సంగీత దర్శకుడిగా రవి బస్రూర్ సాంగ్స్ సిట్టింగ్ లో కూర్చున్నట్టు తెలుస్తోంది. వార్ -2 షూటింగ్ ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ (NTR) ఆ మూవీకి బై చెప్పి పూర్తిగా ప్రశాంత్ నీల్ మూవీ కి డేట్స్ కేటాయిస్తాడు.వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆయన డైరెక్షన్ లో రాబోయే మూవీలో ఎన్టీఆర్ దుమ్ము దులుపుతారంటున్నారు. బాక్సాఫీస్ రికార్డు లు ఏమున్న బద్దలు కావల్సిందే అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








