Pravasi Bharatiya Express : ఎన్ఆర్ఐల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi ) ఈ రోజు ప్రారంభించారు. ఈ రైలు మూడు వారాల పాటు భారతదేశంలోని వివిధ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయణిస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన (Pravasi Teertha Darshan Yojana)లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు.
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు
ఈ రైలును 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ ప్రవాసుల (NRIs) కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 2025 జనవరి 9 న ప్రారంభమయ్యే ఈ రైలు మూడు వారాల పాటు దేశంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణిస్తుంది. ఈ రైలును జనవరి 9 నాడే ప్రారంభించడానికి ఓ ప్రత్యేకత ఉంది. 110 సంవత్సరాల క్రితం 1915లో మహాత్మా గాంధీ (Mahatma Gandhi) దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తేదీ ఇది.
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రూట్లు ఇవే..
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ సఫ్దర్‌గంజ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీ – అయోధ్య – పాట్నా – గయా – వారణాసి- మహాబలిపురం – రామేశ్వరం – మదురై – కొచ్చి – గోవా – ఏక్తానగర్ (కేవాడియా) – అజ్మీర్ – పుష్కర్ – ఆగ్రా రూట్లలో ఈ ట్రైన్ ప్రయణిస్తుంది.
Pravasi Bharatiya Express : 156 ప్రయాణికుల సామర్థ్యం
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలు మొత్తం 156 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. వారి కోసం ఇందులో ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. కేంద్ర రైల్వే శాఖ, పర్యాటక సంస్థ (IRCTC) సహకారంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ఈ టూర్‌ను నిర్వహిస్తోంది.
ఖర్చంతా కేంద్రానిదే..
భారతీయ ప్రవాసులను వారి పూర్వీకుల మూలాలకు మరింత దగ్గరగా చేర్చేంచాలన్నదే ఈ రైలు ప్రారంభానికి ముఖ్యద్దేశం. భారతీయ రాయబార కార్యాలయాలు ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించిన కీలక పత్రాలను స్వీకరించాయి. అర్హులైన వ్యక్తుల విమాన ప్రయాణ ఖర్చులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రవాసులు కేవలం 10 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.ఈ టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణానికి సంబంధించిన అన్ని ఖర్చులనూ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రయాణికులకు ఫోర్‌స్టార్ హోటళ్లలో బస చేసేందుకు అవకాశం కల్పిస్తారు. భారతీయ మూలాలను తమ జ్ఞాపకాల్లో నిక్షిప్తం చేసుకొనేందుకు ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రూపకల్పన ఓ అద్భుత ప్రయత్నమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ రైలు ప్రయాణం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఓ మంచి అవకాశం.
రైలు డిజైన్‌లో ప్రత్యేకతలు
ఈ రైలు (Pravasi Bharatiya Express) ప్రపంచ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడింది. రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి గదుల రూపకల్పన, భోజన వసతులు, వినోద కార్యక్రమాలు వంటి అన్ని అంశాలను ప్రత్యేకంగా రూపొందించారు. అలాగే, ఈ రైలు 45 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు మరింత అనుకూలంగా ఉంటుంది. వయస్సు ఆధారంగా వసతులను ప్రత్యేకంగా పరిగణించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..