PrayagRaj : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభామేళా (Maha Kumbh 2025) ఆధ్యాత్మికంగానే కాకుండా ఉపాధి కల్పనకు దోహదం చేస్తోందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ మహా కుంభామేళా అనేక ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగ నిర్మూలనకు బాటలు వేసిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా పర్యాటక, రవాణా, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ, ఐటీఈ, రిటైల్ రంగాల్లో ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలకు గణనీయ లాభాలు తీసుకొచ్చి యువతరానికి ఉద్యోగావకాశాల కల్పనకు మార్గం సుగమం చేసిందని తేలింది.
తాత్కాలిక.. శాశ్వత అవకాశాలు
ఇప్పటికే మహా కుంభామేళా సందర్భంగా అనేక వ్యాపార, వాణిజ్య సంస్థల ద్వారా యువత తాత్కాలిక ఉద్యోగాలతో ఉపాధి పొందుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్న నేపథ్యంలో భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపాదికన కూడా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది.
PrayagRaj మహా కుంభామేళా ద్వారా 12 లక్షల ఉద్యోగాలు
మహా కుంభామేళా 45 రోజులపాటు కొనసాగనుంది. సుమారు 12 లక్షల (1.2 మిలియన్) ఉద్యోగాలను ఈ ఆధ్యాత్మిక మహా జాతర సృష్టించనుంది. ఇది భారతదేశంలో ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఈ రోజు వెలువడిన ఒక నివేదిక పేర్కొంది. NLB సర్వీసెస్, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి. మహా కుంభామేళా ఆధ్యాత్మిక సమ్మేళనమే కాకుండా ఇది ఆర్థిక కార్యకలాపాలను గణనీయంగా పెంచే మార్గమని దీని సారాంశం.
4.5 లక్షల మందికి తాత్కాలిక ఉద్యోగాలు
- హోటల్ సిబ్బంది, టూర్ గైడ్స్, పోర్టర్లు, ట్రావెల్ కన్సల్టెంట్స్, కోఆర్డినేటర్స్ వంటి తాత్కాలిక ఉద్యోగాలను ఈ మహా కుంభామేళా సృష్టించింది. కేవలం ఈ రంగాల్లోనే సుమారు 4.5 లక్షల మందికి ఉద్యోగాశాలు లభించాయి.
- రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో డ్రైవర్లు, సప్లై చైన్ మేనేజర్లు, కూరియర్, ఇతర సహాయక సిబ్బంది వంటి ఉద్యోగాలు 3 లక్షల మంది పొందుతున్నారు.
- మహా కుంభామేళాలో భక్తుల కోసం తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిలలో ఫ్రీలాన్స్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ఇతర ఆరోగ్య సిబ్బందిని నియమించారు. 1.5 లక్షల మంది ఉద్యోగావకాశం పొందారు.
- ఐటీ, టెక్నాలజీ రంగం కూడా భారీగా ఉద్యోగావకాశాలు లభించాయి. 2 లక్షల సాంకేతిక నిపుణులు వర్చువల్ ద్వారా యాప్‌లు, రియల్-టైం ఈవెంట్ అప్లికేషన్లు , సైబర్ సెక్యూరిటీ వంటి పనులను నిర్వహిస్తున్నారు.
రూ. 2 లక్షల కోట్ల లావాదేవీలు
PrayagRaj మహా కుంభామేళా సుమారు రూ. 2 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలను సృష్టిస్తోందని మరో నివేదిక చెబుతోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈవెంట్ నిర్వహణ, భద్రతా సేవలు, స్థానిక వ్యాపారం, పర్యాటకాలు, వినోదం, హార్టికల్చర్ వంటి రంగాల్లో భారీ లావాదేవీలు జరిగి దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (CAIT) అనే సంస్థ చేసిన అధ్యయనం ద్వారా వెల్లడైంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..