అమెరికా, రష్యా జనాభాను దాటిన భక్తుల సంఖ్య
Maha kumbh 2025 : ప్రయాగ్‌రాజ్( Prayagraj ) లో జరుగుతున్న మహా కుంభమేళా ఆల్‌లైం రికార్డు నమోదు చేసుకుంది. 12ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేలాలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు నిత్యం యాత్రికులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు సందర్శించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది ఏ మతానికి సంబంధించి అయినా ఈ సంఖ్య ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సామూహిక మానవ సమ్మేళనంగా నిలుస్తుందని తెలిపింది. భారత్, చైనా మినహాయించి ఎక్కువ జనాభా గల 8 దేశాల జనాభా సంఖ్యను కుంభమేళాను దర్శించిన హిందూ భక్తుల సంఖ్య దాటేసిందని పేర్కొంది.
యూఎస్ జనాభా బ్యూరో ప్రకారం చైనా, భారత్ తర్వాత అత్యధిక జనాభా (34.20 కోట్లు) గల మూడో దేశం అమెరికా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గణంకాల ప్రకారం ఈ శుక్రవారం ఒక్క రోజే సాయంత్రం 6 గంటల సమయానికి 92 లక్షల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్(Prayagraj) లో పుణ్యస్నానాలు చేశారు. పుష్కర కాలం అంటే 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా, ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.
ఇదిలా ఉండగా జనవరి 29న మౌని అమావాస్యను పురస్కరించుకొని ఇప్పటి వరకు అత్యధికంగా కుంభమేళాను 8 కోట్ల మంది భక్తులు సందర్శించి పుణ్య స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం పేర్కొంది. దురదృష్టవశాత్తు ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతిచెందారు. ఈఘటన జరిగిన తర్వాత కూడా ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు మహా కుంభ మేళాకు వస్తున్నారు.
Prayagraj : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు బయలుదేరిన భక్తుల కారును బస్సు ఢీకొట్టడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ప్రయాగ్‌రాజ్-మిర్జాపూర్ హైవేపై చోటుచేసుకుంది. 12 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ప్రయాగ్ రాజ్ (Prayagraj) మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు త్రివేణి సంగమం ఒడ్డున కొనసాగుతున్న విషయం తెలిసిందే..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..